జ్యోతులకు ఈరోజు జ‌గ‌న్ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 14:39:40

జ్యోతులకు ఈరోజు జ‌గ‌న్ చెక్

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నేటితో  విజ‌య‌వంతంగా 222 రోజుకు చేరుకుంది. న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ‌లో చేప‌ట్టిన ఈ పాద‌యాత్ర నిర్విరామంగా 99 నియోజ‌క‌వ‌ర్గాల‌ను పూర్తి చేసుకుని 100వ నియోజ‌క‌వ‌ర్గం అయిన జ‌గ్గంపూడి నియోజక‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌తో వైఎస్ జ‌గ‌న్ మ‌మేకం కానున్నారు.
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2014 ఎన్నిక‌ల్లో 600 వంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క హామీ అయినా నెర‌వేర్చారా అని ప్ర‌జ‌ల‌ప‌క్షానా ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు తాను టీడీపీ నాయకుల్లాగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి ఆధికారంలోకి రాన‌ని అలాంటి అధికారం నాకు అవ‌స‌రం లేద‌ని చెప్పి 2019లో అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో భాగంగా ఈ రోజు వైసీపీ నాయకులు జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన భారీ భ‌హిరంగ  స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు. ఈ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌జ‌ల క‌ష్ట, న‌ష్టాల‌నే కాకుండా అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి టీడీపీ తీర్థం తీసుకున్న జ్యోతుల నెహ్రూ ప‌రిపాల‌న‌పై కూడా జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చెయ్య‌నున్నారు. ఒక‌ వైపు వైసీపీ అభిమానులు జ‌గ‌న్ స్పీచ్ ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురు చూస్తుంటే మ‌రోవైపు జ్యోతుల అనుచ‌రులు మాత్రం త‌మ నాయ‌కుడిలోని లొసుగుల‌ను జ‌గ‌న్ ఎక్క‌డ బ‌య‌ట‌పెడుతారో అని బ‌య‌ప‌డున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.