నేడు విశాఖ‌కు వైఎస్ జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-11-02 11:52:21

నేడు విశాఖ‌కు వైఎస్ జ‌గ‌న్

విశాఖ విమానాశ్ర‌యంలో ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన హర్ష‌వ‌ర్ద‌న్ కు అత్యంత స‌న్నిహితుడు శ్రీనివాసరావు కోడిపందాల‌కు వాడే క‌త్తితో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు.
 
దీంతో జ‌గ‌న్ ఎడ‌మ చేతికి తీవ్రంగా గాయం కావ‌డంతో ఆయ‌న‌కు వైద్యులు చికిత్స చేశారు. చికిత్స చేసిన త‌ర్వాత జ‌గ‌న్ కు త‌గిలిన గాయం మానాలంటే సుమారు ఆరునెల‌లు ప‌డుతుంద‌ని అలాగే కొద్దిరోజుల పాటు పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించాల‌ని డాక్ట‌ర్లు సూచించిన సంగతి తెలిసిందే.
 
దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు కొద్దిరోజులు విరామం ప్రక‌టించామ‌ని తిరిగి 3వ తేదిన పాద‌యాత్ర ప్రారంభిస్తామ‌ని పార్టీ నేత‌లు ప్ర‌క‌టించారు. ఇక రేపు పాద‌యాత్ర ప్రారంభంకానున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈరోజు అక్ర‌మాస్తుల కేసులో కోర్టుకు హాజ‌రు అయిన త‌ర్వాత అక్క‌డినుంచి అటే విశాఖ‌కు ప్ర‌యాణం చేయ‌నున్నారు. ఒక వైపు జ‌గ‌న్ విశాఖ‌కు వస్తున్నాడ‌న్న సంతోషంలో పార్టీ నాయ‌కులు అభిమానులు, కార్య‌క‌ర్త‌లు వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తుంటే మ‌రోవైపు ఆయ‌న విశాఖ‌లో అడుగు పెట్ట‌గానే పోలీస్ అధికారులు మ‌రింత బందోబ‌స్తుకు అన్ని స‌హాయ‌క చ‌ర్య‌లు సిద్దం చేసుకున్నారు. 
 
అలాగే సిట్ అధికారులు కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని క‌ల‌వ‌నున్నారు. త‌మ ద‌ర్యాప్తుకు స‌హ‌క‌రించాల‌ని, త‌మ‌కుస్టేట్ మెంట్ ఇవ్వాల‌ని క