నేడు వైసీపీ భారీ ధ‌ర్నా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 15:38:17

నేడు వైసీపీ భారీ ధ‌ర్నా

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సుమారు ఆరు వంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అయితే వాటిని ఒక్క‌టి కూడా అమ‌లు చెయ్య‌లేద‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధ‌ర్నా చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక మాట అధికారంలో లేన‌ప్పుడు ఒక మాట మాట్లాడుతున్నార‌ని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. 
 
అందుకే తాము ఈరోజు టీడీపీ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నా చేస్తున్నామ‌ని  వైసీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. 2014 నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విభ‌జ‌న అంశాల విషయంలో యూట‌ర్న్ తీసుకున్నార‌ని ఇప్పుడు 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న తురుణంలో హ‌డావిడిగా రాజ‌కీయ ల‌బ్దీ పొందేందుకు మ‌రోసారి యూట‌ర్న్ తీసుకుని ప్ర‌తీ ఒక్క నిరుద్యోగికి 1000 రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్ప‌డం దారుణం అని వైసీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు. 
 
స‌ర్కార్ ప్ర‌క‌టించిన ఈ వెయ్యి రూపాయ‌లు ఎందుకు స‌రిపోతాయ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అందుకే తాము ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేస్తున్నామ‌ని వైసీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాయ‌కులు చేస్తున్న దారుణాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా చంద్ర‌బాబుకు త‌గిన బుద్ది చెబుతార‌ని వారు స్ప‌ష్టం  చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.