జ‌గ‌న్ కొత్త ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 16:16:39

జ‌గ‌న్ కొత్త ప్లాన్

ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురు రాజీనామా చేసి, ఏపీ భ‌వ‌న్ లో నిరాహార‌దీక్ష చేసిన విష‌యం తెలిసిందే.. ఇక ఇటీవల రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యి ఆయ‌న‌కు ఏపీకి ప్ర‌త్యేక హూదా అంశం పై లేఖ అందించారు... కేంద్రం ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌డం లేద‌ని తెలియ‌చేశారు. ఇక వైసీపీ ఎంపీలు త‌మ పోరాటం మ‌రింత ఉధృతం చేయ‌నున్నారు అని తెలుస్తోంది.... ఇప్ప‌టికే దీక్ష చేసిన వైసీపీ ఎంపీలు నేడు వైయ‌స్ జ‌గ‌న్ తో భేటీ కానున్నారు.
 
ఈ రోజు వైసీపీ ఎంపీలు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్నారు.....  ఇవాళ సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు... ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఈ నెల 6వ తేదీన ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైయ‌స్ అవినాష్‌రెడ్డిలు రాజీనామా చేసి మొద‌టిసారి వైయ‌స్ జ‌గ‌న్ ను క‌లువ‌నున్నారు.
 
ఇక త‌దుప‌రి ప్ర‌త్యేక హూదా కార్యాచ‌ర‌ణ ఎలా చేయాలి అనేది జ‌గ‌న్ నాయ‌కుల‌కు తెలియ‌చేయ‌నున్నారు అని తెలుస్తోంది... ఇక ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు ఈ నెల 20 న దీక్ష చేయ‌నున్నారు.. ప్ర‌త్యేక హూదా కోసం ఇక వైసీపీ కూడా ప్ర‌త్యేక హూదా పోరును మ‌రింత పెంచాలి అని ఉధృతం చేయాలి అని భావిస్తోంది. ఈరోజు సాయంత్రం వైసీపీ నాయ‌కుల‌తో భేటీ త‌ర్వాత జ‌గ‌న్ లేదా వైసీపీ నాయ‌కులు త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ పై స్ప‌ష్టత ఇవ్వ‌నున్నారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.