టాలీవుడ్ చూపు వైసీపీ వైపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-14 13:38:14

టాలీవుడ్ చూపు వైసీపీ వైపు

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న వాళ్ళు రాజకీయాలలో ఎప్పటి నుంచో ఉన్నారు...చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకుని తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేయడం ఎప్పటి నుంచో చూస్తున్నాం...మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి పార్టీ పెట్టినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోని చాల మంది పార్టీలో చేరారు...అప్పటి నుండి సినిమా వాళ్ళు రాజకీయాల వైపు ఎక్కువ చూస్తున్నారు.
 
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ లోని ఎక్కువ శాతం మంది టీడీపీ వైపే మొగ్గు చూపారు. చాలమంది టాలీవుడ్‌లో ప్రముఖులు పార్టీలో చేరకపోయిన ప్రచారం చేశారు...సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తున్నారు అంటే టీడీపీ వైపే చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, ఇప్పుడు అందరి చూపు వైసీపీ వైపే వుంది.
 
ఇప్పటికే పోసాని, పృథ్వి లాంటి వాళ్ళు బహిరంగంగానే వైసీపీకి, జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు...మరి కొంత మంది త్వరలో వైసీపీలోకి వెళ్తున్నారని సమాచారం...మోహన్ బాబు మళ్ళి రాజకీయాలలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం, వైసీపీ నుండి శ్రీకాళహస్తి నుండి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ డైరెక్టర్ వి వి వినాయక్, కొరటాల శివ, ఆనంద్ రాజా, నిఖిల్ ఇంకా కొంతమంది సినిమావాళ్లు  వైసీపీలోకి అడుగులు వేయాలని చూస్తున్నారని సమాచారం.
 
అదే జరిగితే టీడీపీ కంగుతినడం ఖాయం, ఎందుకంటే ప్రతి ఎన్నికలలోను సినిమా తారలతో ప్రచారం చేపించుకోవడం టీడీపీకి ఆనవాయితీ, కానీ ఈసారి ఆ వాతారణం కనపడటం లేదు..చంద్రబాబు తప్పుడు హామీలు, ప్రత్యేక హోదాపై రెండు నాల్కల ధోరణితో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమలో వాళ్ళు కూడా ప్రచారం చేయడానికి సుముఖంగా లేరని సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.