వైయ‌స్సార్ పాత్ర‌లో టాలీవుడ్ అగ్ర‌హీరో

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 01:55:48

వైయ‌స్సార్ పాత్ర‌లో టాలీవుడ్ అగ్ర‌హీరో

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రికి వ‌స్తుందా అని ఇటు రాష్ట్రంలో, ఇరు పార్టీలు ఎవ‌రికి వారు రాజ‌కీయంగా ఎత్తులు పావులు క‌దుపుతున్నారు.. అయితే ఇటు ఎన్నిక‌ల స‌మ‌యానికి రాష్ట్రంలో బ‌యోపిక్ ల హవా కూడా అలాగే రానుంది... ఇప్పుడు ఎన్టీఆర్ పై మూడు బ‌యోపిక్ లు రానున్నాయి.. ఓ సినిమాలో వార‌సుడు బాల‌య్య హీరోగా న‌టిస్తున్నారు ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం తేజ చేస్తున్నారు. 
 
అలాగే వ‌ర్మ డైరెక్స‌న్‌లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌రెడ్డి డైరెక్స‌న్‌లో ల‌క్ష్మీస్ వీర‌గాధ సినిమాలు తెర‌మీద‌కు రానున్నాయి. అయితే తెలుగుదేశానికి ఈ మూడు సినిమాటు బూస్ట్ ఇస్తాయా హీట్ పెంచుతాయా అనేది తేలిపోతుంది.
 
ఇక  వైఎస్ఆర్  బ‌యోపిక్ చిత్రం  కూడా రానుంది...  డైరక్టర్ మహి దర్శకత్వం వహించే ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ శ‌ర‌వేగంగా జరుగుతోంది... ఇప్ప‌టికే జ‌గ‌న్‌ను క‌ల‌సి ప‌ర్మిష‌న్ తీసుకున్నారు... ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్ర‌లో మొద‌ట మమ్ముట్టి, నాగార్జున వంటి పేర్లు ఇప్పటికే వినిపించాయి. ఇంకా కన్నడ, తమిళ, హిందీ నటులను అనేకమందిని పరిశీలిస్తున్నారు..... అయితే తాజాగా ఆయ‌న సినిమాకి  తెలుగు హీరోల‌ను తీసుకుంటే మంచిది అని ఆలోచించారు ద‌ర్శ‌కుడు  
 
ఈ సినిమాకు నాగార్జున‌ను ఫైన‌ల్ చేశారు అని తెలుస్తోంది.. అయితే ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే జ‌గ‌న్ తో చ‌ర్చించార‌ట అలాగే నాగార్జున‌తో కూడా మంత‌నాలు చేయ‌నున్నారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.