అఖిల ప్రియ పెళ్లి కూతురాయ‌నే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bhuma akhila priya
Updated:  2018-08-28 06:19:17

అఖిల ప్రియ పెళ్లి కూతురాయ‌నే

న‌వ‌వ‌ధ‌వుగా మంత్రి భూమా అఖిల ప్రియ వెలిగిపోతుంది. ప్ర‌త్యేకంగా తెప్పించిన పెళ్లి దుస్తుల్లో న‌వ వ‌ధూవ‌రులు క‌ళ‌క‌ళ‌లాడిపోతున్నారు. మంత్రి అఖిల ప్రియ‌కు ప్ర‌త్యేక డిజైన్ల‌తో రూపొందించిన పెళ్లి స్త్రాల‌ను తెప్పించారు. జిల్లాలో మునిపెన్న‌డు జ‌రుగ‌ని రీతిలో ఆమె పెళ్లి జ‌రిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు భూమా కుటుంబ‌ సభ్యులు.
 
రేపు ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి పెళ్లి వేడుక ప్రారంభం కానుంది. ఈ మెమోరియ‌ల్ కు శోభానాగిరెడ్డి ఇంజ‌నీరింగ్ కాలేజ్ వేదిక కానుంది. త‌న వివాహానికి దాదాపు 40 వేల‌మందికి పైగా ఇన్విటేష‌న్లు పంపించారు. అతిర‌థ మ‌హారథులు హాజ‌రయ్యే ఈ పెళ్లి వేడుక‌కు గ‌వ‌ర్నర్ న‌ర‌సింహ‌న్ తో పాటు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు హాజ‌రు కానున్నారు.
 
అంతేకాదు తెలంగాణ నుంచి ముఖ్య‌నేత‌లు హ‌జ‌రు అయ్యే సంబ‌రానికి విందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. రాయ‌ల‌సీమ రుచుల‌తో పాటు ఆయా జిల్లాల‌కు చెందిన వంట‌కాల‌ను కూడా సిద్దం చేశారు. భూమా అఖిల ప్రియ‌కు కాబోయే వ‌రుడు  భార్గ‌వ్ రామ్ రాయ‌ల‌సీమ‌లో ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లు న‌డుపుతున్నారు. ఏడాది కింద‌ట వ‌రుస విషాదాల‌తో త‌ల్ల‌డిల్లిన భూమా కుటుంబం ఇప్పుడు సంతోషాల‌కు కేరాఫ్ గా మారిందంటూ అనుచ‌రులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.