జ‌గ‌న్ పాత్ర‌లో సూర్య‌ కాదు టాప్ హీరో ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 15:02:34

జ‌గ‌న్ పాత్ర‌లో సూర్య‌ కాదు టాప్ హీరో ఫిక్స్

కొద్ది కాలంగా ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోను బ‌యోపిక్ ల హవా ఏ రేంజ్ లో కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే ఇప్ప‌టికే దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌కరామారావు బ‌యోపిక్ ను ఆధారంగా చేసుకుని విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తో పాటు ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా మ‌రో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విడివిడిగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాల‌కు ల‌క్ష్మిస్, ఎన్టీఆర్ అనే టైటిల్ కూడా  ఖ‌రారు చేశాయి ఇరు చిత్ర యూనిట్ బృందాలు. అయితే ఆ రెండు చిత్రాల‌కు రెగ్యుల‌ర్ షూటింగ్ విష‌యంలో కాస్త ఆటంకం క‌లుగుతోంది.
 
ఇక ఇదే  క్ర‌మంలో దివంగ‌త నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు రాఘ‌వ్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి యాత్ర అనే టైటిల్ ను కూడా ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ళ‌యాల న‌టుడు ముమ్మ‌ట్టి, అలాగే  విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత పొన్న‌గంటి న‌టిస్తున్నారు. అలాగే వైఎస్ శ‌ర్మిల పాత్ర‌లో హీరోయిన్ భూమిక న‌టిస్తున్నార‌ట‌. ఇక వైఎస్ అనుచ‌రుడు సూరీడు పాత్ర‌లో పోసాని కృష్ణ ముర‌ళీ న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి హయాంలో రాష్ట్ర హోం మంత్రిగా ప‌నిచేసిన స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి సుహాసిని న‌టించ‌బోతున్న‌ట్లు అలాగే వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు న‌టిస్తున్నారు.. ఇక ఈ పాత్ర‌లకు వీరినే ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. 
 
అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో న‌టించే హీరో స‌స్పెన్స్ గా మారుతోంది. మొద‌ట్లో జ‌గ‌న్ పాత్ర‌లో సూర్య న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సూర్య త‌మ్ముడు కార్తీ న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎప్ప‌టినుంచో సూర్యకు వైఎస్ ఫ్యామిలీకి ఉన్న‌ అనుబంధం వల్ల ద‌ర్శ‌కుడు రాఘ‌వ్ ఈజీగా ఒప్పించార‌ని తెలుస్తోంది. చూడాలి మ‌రి ఆ మ‌ధ్య‌కాలంలో చిన‌బాబుతో స‌క్సెస్ లో ఉన్న కార్తీ ఈ సినిమా ఒప్పుకుంటే, టాలీవుడ్ లో మ‌రింత ఫేమ్ వ‌స్తుందని అంటున్నారు. ఈ సినిమా 2019 లో సంక్రాంతికి విడుద‌ల కానుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.