అగ్రిగోల్డ్ వెనుక వాస్త‌వాలు ఏమిటి ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 16:24:36

అగ్రిగోల్డ్ వెనుక వాస్త‌వాలు ఏమిటి ?

అగ్రిగోల్ట్ సౌత్ ఇండియాలో పెద్ద గోల్ మాల్ లా వినిపిస్తున్న అంశం... డిపాజిట్ దారులు త‌మ న‌గ‌దు ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూపులు అలాగే డిపాజిట్లు చేయించిన ఏజెంట్ల పై ఒత్తిడి వారి ఆత్మ‌హ‌త్య‌లు ఏపీలో  తెలంగాణ‌లో ప్ర‌జ‌లు న్యాయం కోసం నిరీక్ష‌ణ చేస్తున్నారు.. తెలుగుదేశం స‌ర్కారు దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
అగ్రిగోల్డ్ కుంభ‌కోణం లో పెద్ద‌లు చాలా మంది ఉన్నారు అని ప్ర‌తీ ఒక్క‌రూ అనే మాట‌…. 32 లక్షల మంది అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల ఆశలను అడియాసలు చేసే దిశగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం,అడుగులు వేస్తుంది అని ఇప్ప‌టికే అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.... అగ్రిగొల్డ్ కంపెని ఆస్థుల విలువ 25 వేల కొట్ల రూపాయల వరకు ఉందని,డిపాజిటర్లు కలత చెందవద్దని,గత 4 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,మంత్రులు డిపాజిట్ దారుల‌ను నమ్మిస్తూ వస్తున్నారు.
 
అగ్రిగొల్డ్ ఆస్థులను కొంటామని ఎస్సెల్ జి (ESSEL ZEE) గ్రూపు గ‌తంలో ముందుకు  వచ్చింది….తాజాగా ఎస్సెల్ జి గ్రూప్,అగ్రి గొల్డ్ ఆస్థులను టేక్ ఓవర్ చెయ్యలేమని కొత్త వాద‌న‌ ముందుకు తెచ్చింది. అయితే 2017 లొ ఎస్సెల్ గ్రూపు, ఒక బ్రిటన్ కంపెనితొ విచారణ చేయించుకుని అగ్రి గొల్డ్ ఆస్థుల విలువ 25 వేల కొట్లుగా నిర్ధారించుకున్నారు.ఇప్పుడు,అగ్రి గొల్డ్ ఆస్థుల విలువ 2500 కొట్లు మాత్రమేనని,కొత్త వాద‌న వినిపిస్తున్నారు.దీంతో ఇప్పుడు అంద‌రూ ఇదే విష‌యం పై చ‌ర్చించుకుంటున్నారు.
 
గ‌త వారం కోర్టులొ తాజాగా,ఎస్సెల్ జి గ్రూప్ కొత్త వాద‌న వినిపించింది.....అగ్రి గొల్డ్ ఆస్థుల నిర్ధారణకు మరొక 8 వారాలు సమయం కావాలని,మధ్యవర్తిగా ఉన్న అమర్‌సింగ్‌ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని కోర్టుకే చెప్పింది ఎస్సెల్ జి గ్రూప్…. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం–తమ ఫౌండేషన్‌ సంయుక్తంగా అగ్రిగోల్డ్‌ స్థిరాస్తులను అభివృద్ధి చేసేలా అమర్‌సింగ్‌ చర్చలు జరుపుతున్నారని కూడా తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి అగ్రిగోల్డ్‌ గ్రూపులో పెట్టుబడులపై పునరాలోచన చేస్తామంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం స‌ర్కారు వెనుక ఉండి ఎటువంటి ప్లాన్ వేస్తున్నారు అని ప్ర‌జ‌లు కూడా చ‌ర్చించుకుంటున్నారు.
 
ఎస్సెల్ జి గ్రూప్,అమర్‌సింగ్‌ పేరును తెరపైకి తేవడంపై న్యాయమూర్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.... ఎస్సెల్ జి గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ సుభాష్‌చందర్‌జీ, ప్రముఖ రాజకీయ నేత అమర్‌సింగ్‌లతో సైకిల్ పార్టీ అధినేత చ‌ర్చ‌లు జ‌రిపారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ఇక అగ్రిగోల్డ్ లో దేశ వ్యాప్తంగా  32 ల‌క్ష‌ల మంది అగ్రి గొల్డ్ బాధితులు ఉండగా,ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 19 లక్షల మంది ఉన్నారు అని చెబుతున్నాయి రిపోర్టులు....గ‌త సంవ‌త్స‌రం లోనే 25 వేల కోట్ల రూపాయలు అన్నారు ఇప్పుడు 2500 కోట్లు అన్నారు.. అంటే 90 శాతం విలువ త‌గ్గించేశారా?  తగ్గిందా?  అంకెలు మార్చారా జ‌నాల‌కు నిజాలు తెలియాలి అనేది ప్ర‌జ‌ల వాద‌న మ‌రి నిజాలు ఏమిటి అగ్రిగోల్డ్   బాధితుల‌కు ఎటువంటి న్యాయం జ‌రుగుతుంది అనేది మ‌రో రెండు నెల‌ల్లో తెలియంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.