టీవీ9 ఫ‌ర్ సేల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

media
Updated:  2018-08-18 04:03:35

టీవీ9 ఫ‌ర్ సేల్

శాటిలైట్ ఛాన‌ల్స్ లో రారాజు అయిన‌టువంటి టీవీ9 ఛాన‌ల్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిరంత‌రం ప్ర‌జ‌ల ప‌క్షాన‌ నిలుస్తూ ప్ర‌భూత్వాల‌ను క‌దిలించిన ఛాన‌ల్ టీవీ9. అంత‌టి గుర్తింపు తెచ్చుకున్న ఛాన‌ల్ ఇప్పుడు మెగా ఇంజ‌నీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ సంస్థ‌కు ప‌రిమితం అవుతోందనే వార్త‌లు వ‌స్తున్నాయి.
 
మెగా సంస్థ దేశంలో ప‌లు భారీ ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేసుకుని అనేక రంగాల‌లో విస్త‌రించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ. అయితే ఇప్పుడు మీడియా రంగంలో కూడా అడుగుపెట్టి త‌న ఖ్యాతిని నిరూపించుకోవాల‌ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్ప‌టికే Nటీవీ సంస్థ‌తో భాగ‌స్వామిగా ఉన్న మెగాసంస్థ ఇప్పుడు ఏకంగా ఒక ఛాన‌ల్ కొని మీడియాలో గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఆసిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం కూడా బ‌హుశా సెప్టెంబ‌ర్ నెలాఖ‌రిలోపు టీవీ9 ఛాన‌ల్ మెగా చేతిలోకి రావ‌చ్చ‌నే ప్ర‌చారం సాగుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.