జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan-image
Updated:  2018-04-01 10:40:31

జ‌గ‌న్ ట్వీట్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాలను ఎండ‌గ‌డుతూ... ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, అలాగే తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కువివ‌రిస్తూ ముందుకుసాగుతున్నారు జ‌గ‌న్... ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప యాత్ర తెలుగు దేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
ఇక తాజాగా జ‌గ‌న్  క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్‌ సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు... పునరుద్ధానుడైన క్రీస్తుఏసు ఆశీర్వాదాలు ప్రతీ కుంటుబానికి లభించాలని ఆకాంక్షించారు . ‘‘మీకు, మీ కుటుంబాలకు ప్రేమ, శాంతి చేకూరాలని కోరుతున్నా. అందరికీ ఈస్టర్‌ శుభాకాంక్షలు’’ అని వైఎస్‌ జగన్‌ ఆదివారం ఓ ట్వీట్ చేశారు
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.