ఆవేద‌న‌తో జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 13:24:16

ఆవేద‌న‌తో జ‌గ‌న్ ట్వీట్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో  ఆవేద‌న‌తో ట్వీట్ చేశారు... ఆంధ్రప్రదేశ్ కు అపర సంజీవని అయిన ప్ర‌త్యేక హోదా  కోసం త‌మ పార్టీ నాయ‌కులు త‌మ ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా పోరాటం చేస్తున్నార‌ని తెలిపారు... ఈ పోరాటంలో భాగంగానే వైసీపీ ఎంపీలు మంగ‌ళ‌వారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి.. లేఖను అందించారని ట్వీట్ చేశారు జ‌గ‌న్.
 
విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్, క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ‌లు త‌క్ష‌న‌మే కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌క‌టించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ విజ్ఞ‌ప్తి చేస్తూ ట్వీట్ చేశారు.. అలాగే త‌మ ఎంపీలు రాష్ట్ర‌ప‌తికి స‌మ‌ర్పించిన లేఖ‌ను కూడా ట్వీట్ చేశారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా జ‌గ‌న్ త‌లపెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.... ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ  అధికార టీడీపీ నాయ‌ల‌కులు  చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ ముందుకుసాగుతున్నారు జ‌గ‌న్.. దీంతోపాటు వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.