ఆళ్ల‌గడ్డ పంచాయతీలో ట్విస్ట్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 18:16:27

ఆళ్ల‌గడ్డ పంచాయతీలో ట్విస్ట్‌

ఆళ్ల‌గ‌డ్డ‌లో మంత్రి అఖిల ప్రియకు ఏవీ సుబ్బారెడ్డికి కొద్ది రోజులనుంచి వివాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి... ఫ్యామిలీ వివాదాల నుంచి రాజ‌కీయాల్లో వార్ ర‌చ్చ‌కెక్కింది.....ఇప్ప‌టికే రెండు సార్లు సీఎం స్వ‌యానా వీరి ఇద్ద‌రితో అమ‌రావ‌తిలో మాట్లాడారు..
 
ఇక ఏవీపై రాళ్ల‌దాడితో మంత్రి అఖిల పై మ‌రింత ఫైర్ అయ్యారు సుబ్బారెడ్డి.... ఏవీ అమ‌రావ‌తిలో మ‌రోసారి పంచాయ‌తీ పెట్టించారు....తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మంత్రి అఖిల ప్రియ‌ను ఏవీ సుబ్బారెడ్డిని అమ‌రావ‌తిలో క‌లిసి చ‌ర్చించారు..ముందు విడివిడిగా ఇరువురితో మాట్లాడారు చంద్ర‌బాబు.
 
ముందు వీరిద్ద‌రి మ‌ధ్య ఎందుకు గొడ‌వ చోటుచేసుకుంది అనే అంశంపై చంద్ర‌బాబు ఆరాతీసిన‌ట్లు తెలుస్తోంది... ఇక వీరిద్ద‌రి వాద‌న‌లు విన్న ముఖ్యమంత్రి వారికి న‌చ్చ‌చెప్పి ఆళ్ల‌గడ్డ అభివృద్దికోసం కృషి చేయాల‌ని ఇలాంటి గొడ‌వ‌ల‌కు పాల్ప‌డ‌టం మంచిది కాద‌ని చంద్ర‌బాబు సూచించార‌ట‌... ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా పార్టీ కోసం, ప్ర‌జ‌ల అభివృద్ది కోసం పనిచేయాల‌ని సూచించారు, ఇరువురికి చంద్ర‌బాబు హితోప‌దేశం చేశారు.
 
ఇక ఇదే విష‌యంపై  అఖిలప్రియ మాట్లాడుతూ...ఇప్పుటి వరకు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నామ‌ని ఇక నుంచి టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు...అలాగే  చంద్రబాబు ఆదేశాలను త‌ప్ప‌క పాటిస్తామ‌ని అందరితో కలిసి పనిచేస్తామ‌ని, చిన్నచిన్న వివాదాలుంటే కూర్చొని మాట్లాడుకుంటామ‌ని అఖిల ప్రియ స్ప‌ష్టం చేశారు... ఆళ్లగడ్డలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూసుకుంటామ‌ని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటి అంటే గ‌తంలో ఇరువురితో చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో స‌యోధ్య కుదిర్చిన త‌ర్వాత  కూడా ఇరువురు అదే స్టేట్ మెంట్లు ఇచ్చారు....క‌లిసి ప‌నిచేస్తామ‌ని... అలా  15 రోజులు తిర‌క్కుండానే ఇరు వ‌ర్గాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి... రెండు నెల‌ల‌కే రాళ్ల‌దాడితో మ‌ళ్లీ అమ‌రావ‌తి పంచాయ‌తీకి వచ్చారు... ఈసారి వీరి త‌గువును ఏకంగా వ‌ర్ల రామయ్య తీర్చారు... ఇక్క‌డ ట్విస్ట్ ఏమిటి అంటే ఇంత వివాదం జ‌రిగితే ఇది టీ క‌ప్పులో సునామిలాంటిది అని వ‌ర్ల రామయ్య అన్నారు.. ఇంత టి క‌ప్పులో సునామికి ఏకంగా ఆళ్ల‌గ‌డ్డ నుంచి అమ‌రావ‌తి వ‌చ్చి రెండు రోజులు మీటింగ్ ఏర్పాటుచేయాలా అని కొంద‌రి వాద‌న‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.