నారాయ‌ణ రెడ్డి హ‌త్య కేసులో సంచ‌లనం....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 12:56:46

నారాయ‌ణ రెడ్డి హ‌త్య కేసులో సంచ‌లనం....

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌త్తికొండ ఇన్ చార్జ్ చెరుకుల పాడు నారాయ‌ణ రెడ్డి హ్య‌త‌కేసు మ‌రో కీల‌క మలుపు తిరిగింది. ప‌ట్ట‌ప‌గ‌లు నారాయ‌ణ రెడ్డిని  ప్ర‌త్య‌ర్ధులు హ‌త్య చేసిన ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం  సృష్టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ  హ‌త్య కేసులో పోలీసులు 15 మందిపై ఎఫ్ఐఆర్‌ను న‌మోదు చేశారు. 
 
ఇందులో ప‌త్తికొండ ఎమ్మెల్యే, ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడు శ్యాంబాబు పేరును చేర్చారు.  ఎ-14గా కే.ఈ శ్యాం బాబును,  చెరుకులపాడు గ్రామానికే చెందిన కుర‌వ రామాంజ‌నేయులును ఎ-1గా చేర్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి క‌ర్నూలు జిల్లా డోన్ కోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. కే.ఈ శ్యాం బాబుతో స‌హా మ‌రో ఇద్ద‌రిని నిందితులుగా  చేర్చి అరెస్ట్ చేయాల‌ని డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ycp leader narayana reddy
 
ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్యాం బాబు  గ‌త కొన్ని నెల‌లుగా క‌పిపించ‌కుండా తిరిగారు..... కేసును నీరుగార్చేందుకు కే.ఈ కుటుంబం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. చార్జిషీట్ నుండి శ్యాం బాబు పేరును తొల‌గించేందుకు కే.ఈ ఫ్యామిలీ  అనేక వ్యూహాలు ర‌చించింది. ఛార్జిషీట్ నుండి శ్యాం బాబు పేరును తొల‌గించడం పై నారాయ‌ణ రెడ్డి భార్య  శ్రీదేవీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీనిపై డోన్ కోర్టును ఆశ్ర‌యించింది. ఈ క్ర‌మంలోనే   ప్ర‌స్తుతం డోన్ కోర్టు కే.ఈ కుటుంబానికి షాక్ ఇచ్చింది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.