సీఎం స‌న్నిహితుడు చుట్టు సీబీఐ ఉచ్చు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-10-29 13:08:03

సీఎం స‌న్నిహితుడు చుట్టు సీబీఐ ఉచ్చు

కొద్దిరోజుల‌క్రితం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సీబీఐ లంచాల కేసు తాజాగా కొత్త‌మ‌లుపు తిరిగింది. మొత్తం ఈ కేసుకు కేంద్ర బిందువుగా మారిన తెలుగు వ్యాపారి సానా స‌తీష్ బాబు గ‌తవారం నుంచి ఆచూకి లేకుండా పోయాడు. మ‌ట‌న్ ఎగుమ‌తుల వ్యాపారి కురేషీకి సానా స‌తీష్ అత్యంత స‌న్నిహితుడు సీబీఐ డైరెక్ట‌ర్ అలోక్ వ‌ర్మకు సుమారు రెండు కోట్ల లంచం ఇచ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంలోనే అలోక్ కి, సానా లంచం ఇచ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ఈ విష‌యంలో అలోక్ వ‌ర్మ‌పై సీబీఐ స్పెషల్ డైరెక్ట‌ర్ రాకేష్ ఆస్థాన లిఖిత పూర్వ‌క ఫిర్యాదు కూడా చేశారు. అయితే స‌తీష్ బాబు వాంగ్ములాన్ని ఫోర్జ‌రీ చేసిన‌ట్లుగా ఆస్థానపై చార్జిషీట్ న‌మోదు అయింది. 
 
ఈ నేప‌థ్యంలో సానా స‌తీష్ బాబు విచారిస్తేనే మొత్తం వాస్తవాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని సీబీఐ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్ర‌స్తుం స‌తీష్ బాబు ఆచూకి తెలియ‌టంలేదు. పైగా త‌న‌ను అరెస్ట్ చేయకుండా ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఆత‌డు సుప్రీం కోర్టులో పిటీష‌న్ కూడా వేశారు. అంతేకాదు ప్ర‌స్తుతం ఎంపీ సీఎం ర‌మేష్ కూడా విదేశాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం.

షేర్ :