ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-24 11:50:11

ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్

ఏ కేసు అయితే తెలుగుదేశాన్ని హైద‌రాబాద్ నుంచి క‌ర‌క‌ట్ట‌కు వ‌చ్చేలా చేసిందో... ఏ కేసు అయితే ఏపీకి ప్ర‌త్యేక హూదా రాకుండా అడ్డుప‌డుతుందో.... ఆ బ్రీఫ్ డు మీ  కేసు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.. జైల్లో ఊచ‌లు లెక్క‌పెట్టిస్తా అని తెలంగాణ సీఎం అంటే, నీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది అని ఇక్క‌డ సీఎం విమ‌ర్శ‌లు చేశారు.. చివ‌ర‌కు ఇద్ద‌రూ ఎటువంటి దుందుడుకు చ‌ర్య‌లు చేయ‌లేదు.. అయితే ఈ కేసు మొద‌ట్లో ఉన్న స్పీడు త‌ర్వాత ఎందుకు త‌గ్గిపోయింది అంటే అంతా హ‌స్తిన మ‌హిమ అంటారు.. అలాంటి కేసు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది... ఓ స‌రికొత్త ట్విస్ట్ పెట్టింది.
 
ఈ కేసులో ఏ4 నిందితుడుగా ఉన్న మ‌త్త‌య్య సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ట కు లేఖ రాశారు.. దీంతో ఒక్క‌సారిగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు మ‌రో ముందు అడుగు వేసిన‌ట్లు అయింది. ఈ కేసులో తాను అప్రూవ‌ర్ గా మార‌తాను అని సీజేకు లేఖ రాశారు... ఈకేసులో మ‌త్త‌య్య వెల్ల‌డించిన అంశాలు ఏమిటంటే?
 
కొంద‌రు పెద్ద‌లు ఈ కేసుల‌ను నీరుగార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, అంతేకాదు  త‌న‌ను చంపేందుకు ప‌థ‌కాలు రెడీ చేశార‌ని ఆయ‌న తెలియ‌చేశారు.. త‌న‌పై తెలుగుదేశం టీఆర్ ప్ర‌భుత్వాలు ఒత్తిడి తీసుకువ‌స్తున్నాయి అని అన్నారు.... అందుకే తాను చెప్పుకోవ‌ల‌సింది చాలా ఉంద‌ని, ఈ కేసులో అప్రూవ‌ర్ గా మార‌తాను అని లేఖ‌లో మొర‌పెట్టుకున్నాడు.
 
ఈ కేసుకు సంబంధించి త‌న‌కు తెలిసిన అన్ని విష‌యాలు చెబుతా అని సీజేకి లేఖ‌లో కోరారు..ఈ కేసులో చాలా విష‌యాలు బ‌య‌ట‌కు రాకుండా త‌న‌ని హ‌త్య చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతున్నార‌ని, కోర్టు ముందు త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా దీనిపై మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాలి అని కోరాడు మ‌త్త‌య్య‌.
 
త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని త‌న‌ని ర‌క్షించాల‌ని అన్నారు.. తెలుగుదేశం అనైతిక‌త‌కు పాల్ప‌డింది అని అన్నారు ఆయ‌న‌. ఇక ఓటుకు నోటుకేసులో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన రెండు కేసుల‌ను సీబీఐకి అప్ప‌గించాలి అని ఆయ‌న కోరారు.
 
దీంతో క‌ర‌క‌ట్ట ఒక్క‌సారిగా క‌దిలింది.. బీజేపీ పై తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేయ‌డం ఈ కేసు తెర‌పైకి రావ‌డం అంతా తెలుగుదేశానికి చుట్టూ నిప్పుల గుండంలా మారింది అని, ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలా బాబుకు స‌రికొత్త చిక్కులు అని అంటున్నారు మ‌రి ఈ కేసులో ఇంకెంత స‌స్పెన్స్ లు చూడాలో మ‌రి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.