ఇద్ద‌రు టీడీపీ కీల‌క నాయ‌కులు వైసీపీలోకి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 15:56:24

ఇద్ద‌రు టీడీపీ కీల‌క నాయ‌కులు వైసీపీలోకి

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014 లో మొద‌టి సారిగా ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజారిటీతో వైఎస్ జ‌గ‌న్ అధికారాన్ని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అధికార నాయ‌కులు ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన నాయ‌కులు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో సుమారు 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం తీసుకున్నారు.ఇలా సుమారు రెండు సంవ‌త్స‌రాల పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌ల‌స‌లు విప‌రీతంగా పెరిగిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఎప్పుడైతే ప్ర‌తిప‌క్ష‌నేత  జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌న్న పాల‌న‌ను తీసుకు రావ‌డానికి ఎర్ర‌ని ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు స్వీకారం చుట్టారు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక వారు ప‌డుతున్న బ్ర‌హ్మ‌ర‌థాన్ని చూసి 2019లో క‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి మెల్ల‌గా టీడీపీ నాయ‌కులు త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో  వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు.
 
అయితే ఇప్ప‌టికే కృష్ణా జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి అలాగే ప్ర‌ముఖ్య పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌, తన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు క‌లిసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు కోగ‌టం విజ‌య భాస్క‌ర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
ఇక ఇదే క్ర‌మంలో మ‌రో ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. వారు కానీ వైసీపీలోకి చేరితే నెల్లూరులో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతాయి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. నెల్లూరులో రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని కుటుంబం ఆనం కుటుంబం. ద‌శాబ్దాల నుంచి ఆనం ఫ్యామిలీ రాజ‌కీయంలో ఓ వెలుగు వెలిగారు. అయితే ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిణామాల వ‌ల్ల‌  వీరు ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అసంతృప్తితో ఉన్నారు.
 
అందుకే వారు టీడీపీ నాయుకులు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కొంత కాలంగా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఆనం ఫ్యామిలీ వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.ఆనం ఫ్యామిలీతో  పాటు  టీడీపీ పార్లమెంట్ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సిద్దంగా వున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు స‌మాచారం.ఈ నేప‌థ్యంలో ఆనం, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.
 
గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి జగన్ విషయంలో నోరు జారామని అన్నారట‌. అయితే ఇప్పుడు మోసపు మాటలకు మోసపోయామన్న బాధ నిరంత‌రం వేధిస్తోందని విజ‌య‌సాయి రెడ్డితో చెప్పుకున్నారు. త‌మ ఎప్ప‌టినుంచో వైఎస్ కుటుంబం అంటే అభిమానం ఉందని మొరపెట్టుకున్నారు. త‌న‌కు 2019 ఎన్నిక‌ల్లో సీటు కేటాయించ‌కున్నా కానీ  వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఆనం రామాయణరెడ్డి అన్నారు. 
 
చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో తాను రాజ‌కీయంగా బ‌ల‌హీన‌మ‌య్యాన‌ని ఇక ఇప్పుడు జ‌గ‌న్ హామీ ఇస్తే వైసీపీలో చేరి త‌న బ‌లాన్ని మెరుగుప‌రుచుకునేందుకు సిద్దంగా వున్నానని అన్నారు. త‌న‌తో పాటు మ‌రికొంత మంది టీడీపీ నాయకులు,అనుచరులు అందరినీ తీసుకొస్తానని ఆనం, విజ‌య‌సాయి రెడ్డికి మాటిచ్చార‌ట.
 
అలాగే ఆదాల ప్ర‌భాక‌రరెడ్డి  విష‌యాన్నికూడా ఆనం రామ‌నారాయణరెడ్డి, విజ‌య‌సాయి రెడ్డితో చ‌ర్చించారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున సీటును కేటాయిస్తే ఆయ‌న కూడా జ‌గ‌న్ స‌మక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని ఆనం తెలిపారు. కొద్దికాలంగా వీరిద్ద‌రూ  నెల్లూరు జిల్లా టీడీపీ నాయ‌కుడు సోమిరెడ్డికి శత్రువులుగా మారారు. అందుకే వీళ్ళిద్దరూ కలిసి సోమిరెడ్డి, చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు వ్యతిరేకంగా టీడీపీని దెబ్బకొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.