కోబ్రా పోస్టుకు చిక్కిన రెండు తెలుగు ప్ర‌ముఖ ఛాన‌ల్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

cobra posting sting operation
Updated:  2018-05-26 06:52:31

కోబ్రా పోస్టుకు చిక్కిన రెండు తెలుగు ప్ర‌ముఖ ఛాన‌ల్స్

5 కోట్ల వ‌ర‌కు బ్లాక్ మ‌నీ ఇస్తే హిందుత్వ అజెండాకు అనుగుణంగా వార్తలు ప్రసారం చేస్తామని ABNఆంధ్ర‌జ్యోతి,TV 5 ప్ర‌తినిధులు చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటిని ప్ర‌చురించ‌డంలో త‌మ‌నుమించిన వారు లేర‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌కు డ‌బ్బులు ఇస్తే హిందూ నాయకుల మతతత్వ ప్రసంగాలు, ఉపన్యాసాలను ప్రసారం చేస్తామ‌ని కోబ్రా పోస్ట్ తో తెలిపారు.
 
తాజాగా ‘ఆపరేషన్ 136 పార్ట్ 2’ అనే పేరుతో కోబ్రాపోస్ట్ ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. డబ్బులు తీసుకుని హిందుత్వ అజెండాకు అనుగుణంగా వార్తలు ప్రచురించేందుకు 17 మీడియా సంస్థలు అంగీకరించాయంటూ కోబ్రాపోస్ట్ వెబ్‌సైట్ వెల్లడించింది.ఇక వారు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌ లో ABN/ఆంధ్ర‌జ్యోతి,TV 5 ప్ర‌తినిధులు బండారం బయటపడిందని కోబ్రాపోస్ట్ ఎడిటర్ అనురుద్ధ బహల్ ప్ర‌క‌టించారు. ఐదు కోట్ల వ‌ర‌కు బ్లాక్ మ‌నీ ఇస్తే తాము ఈ పని చేసి పెడ‌తామ‌ని ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి, టీవీ 5 ప్ర‌తినిధులు ఒప్పుకున్నారు. ఇలాంటి పనులు చేయడంలో త‌మ‌ది పై చేయి అంటూ వారు చెప్పుకొచ్చారు.
 
అలాగే త‌మ‌కు కాంగ్రెస్‌, బీజేపీలోని కొంద‌రి నేత‌లతో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని ఏబీఎన్ మార్కెటింగ్ మేనేజ‌ర్ తెలిపారు. త‌మ‌ బాస్ పొలిటిక‌ల్ జ‌ర్న‌లిస్టు నుంచి య‌జ‌మానిగా మారార‌ని చెప్పారు. అంతే కాదు త‌మ‌కు టీడీపీతో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు తామే టెక్నిక‌ల్ స‌హ‌కారం అందిస్తామ‌ని అన్నారు. అలాగే మొన్న‌జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించడ‌మే ల‌క్ష్యంగా చేసుకుని తాము నిరంత‌రం ప‌ని చేశామ‌ని గుర్తు చేశారు.
 
ఇటు TV5 ప్ర‌తినిధి కూడా త‌మ ఛాన‌ల్ గురించి చెప్పుకొచ్చారు డీమానిటైజేష‌న్ విష‌యంలో మా ఛాన‌ల్ మాత్ర‌మే బీజేపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసింద‌ని, ప్ర‌చారం చేసినందుకు ప్ర‌ధాని మోడీ టీవీ 5 య‌జ‌మానిని దేశ రాజ‌ధానికి పిలిపించుకుని మాట్లాడార‌ని డ‌బ్బా కొట్టారు. త‌మ‌కు డ‌బ్బులు ఇస్తే ప్ర‌తిప‌క్షాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డం వారికి వ్య‌తిరేకంగా వార్త‌లు కూడా రాస్తామ‌ని కోబ్రాతో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలిపింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.