జ‌గ‌న్ దెబ్బ‌కు మైల‌వ‌రంలో చేతులేత్తేసిన ఉమా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-10-08 03:08:17

జ‌గ‌న్ దెబ్బ‌కు మైల‌వ‌రంలో చేతులేత్తేసిన ఉమా

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి దేవినేని ఉమా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా స‌రే అందులో ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు ఖ‌చ్చితంగా ప్ర‌స్తావిస్తారు. దేశంలో ఎక్క‌డ పోర‌పాటు జ‌రిగినా కూడా అది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయించి ఉంటార‌ని లేనిది ఉన్న‌దిగా క్రీయోట్ చేసి మీడియా ముందు మాట్లాడుతుంటారు ఉమా.  బ‌హూషా ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పేరును కూడా ఇంత‌లా మీడియా ముందు పొగిడి ఉండ‌ర‌ని కొంత‌మంది వాద‌న... 
 
ఇలా సుమారు ప‌ది సంవ‌త్స‌రాల‌పాటు మంత్రి దేవినేని ఉమా జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ చేస్తూ ఉంటారు. ఇక ఆయ‌న మాట‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో ఓ వార్త సంచ‌ల‌నం రేపుతుంది. 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కృష్ణా జిల్లాకు చేరుకోగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంత్రి ఉమాకు ఓడించాల‌నే ఉద్దేశంతో  టీడీపీకి చెందిన వంస‌త‌ఫ్యామిలీని వైసీపీలో చేర్చుకున్నారు.
 
వ‌సంత ఫ్యామిలీ ఎప్పుడు అయితే వైసీపీ తీర్థం తీసుకుందో అప్ప‌టినుంచి నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో అనేక అభివృద్ది కార్య‌క్రాలు చేస్తూ ప్ర‌జ‌లకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అంతేకాదు నాలుగు సంవ‌త్స‌రాల్లో మంత్రి చేసిన అభివృద్ది శున్యం అంటూ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌లు పోటీ విష‌యంలో మంత్రి దేవినేని ఉమా చేతులు ఎత్తేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ప్ర‌స్తుతం ప్ర‌తినిధ్యం వ‌హిస్తున్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కాకుండా 2019లో టీడీపీ త‌ర‌పున వేరే నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ప‌డ్డార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మైల‌వ‌రం నుంచి పోటీ చేస్తే ఓట‌మి త‌ప్ప‌ద‌నే అంచ‌నాతో దేవినేని ఉమా వేరే నియోజ‌క‌వ‌ర్గానికి మాకం వేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో ప్ర‌ధానంగా నూజివీడుకు పేరు వినిపిస్తోంది. 
 
నూజివీడు కాక‌పోతే చంద్ర‌బాబు ప్ర‌స‌న్నం చేస్తే వేరే నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌త్య‌ర్థుల‌ను త‌న మాట‌ల‌తో కోట‌లు దాటించే నీటి పారుద‌లశాఖ మంత్రి ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కాద‌ని సురక్షిత నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయ్యాల‌ని చూస్తుంటే జ‌గ‌న్ వేసిన ప్లాస్ స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి. ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉంది. ఈ టైంలో ఇటాంటి భ‌య‌స్తులు ఇంకా ఎంత‌మందివ‌స్తారోన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.