వైసీపీ ఎంపీలు మంచి ప‌ని చేశారట‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 03:06:15

వైసీపీ ఎంపీలు మంచి ప‌ని చేశారట‌

కేంద్ర బ‌డ్జెట్  తో పాటు  పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయ ప‌రిస్ధితుల‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ త‌న‌దైన శైలిలో స్పందించారు. గ‌త నాలుగేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ద్వారా న‌ష్టం జ‌రుగుతూనే ఉంద‌ని ఇప్పుడు కొత్త‌గా జ‌రుగుతున్న‌ట్లు ఈ గోల ఏంట‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. 
 
కేసుల‌కు బ‌య‌ప‌డి కేంద్రాన్ని నిల‌దీయ‌కుండా ఉండ‌టం స‌రికాద‌ని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు ఉండ‌వ‌ల్లి. కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డంపై ఆయ‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. 
 
బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగినందుకుగానూ పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌పై చర్చించేందుకు వైసీపీ 184 నిబంధ‌న కింద నోటీసులు ఇవ్వ‌డం మంచి ప‌రిణామం అని అన్నారు. ఈ  నిబంధ‌న కింద నోటీసులు ఇస్తే ఓటింగ్ కూడా నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని ఉండ‌వ‌ల్లి  తెలిపారు. 
 
ప్ర‌తిప‌క్షం ఇస్తున్న ఫిర్యాదుల‌ను టీడీపీకి మిత్ర‌ప‌క్ష‌మైన భార‌తీయ జ‌న‌తా పార్టీనే ప‌ట్టించుకోవ‌డం లేదంటే ఏపీలో ప్ర‌భుత్వ పాల‌న ఎంత బ‌ల‌హీనంగా ఉందో అర్ధం చేసుకోవాల‌ని అన్నారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మేల్కోక‌పోతే చ‌రిత్ర హీనుడిగా మిగిలిపోతార‌ని హిత‌వు ప‌లికారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.