ప‌వ‌న్ సీక్రెట్ ను బ‌య‌ట‌పెట్టిన ఉండ‌వ‌ల్లి ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-20 03:27:21

ప‌వ‌న్ సీక్రెట్ ను బ‌య‌ట‌పెట్టిన ఉండ‌వ‌ల్లి ?

తిరునాళ్లు జ‌రిగిన నెల రోజుల‌కు పండ‌క్కి ఇంటికి వెళ్లిన‌ట్టు, కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులు గురించి తెలుగుదేశం నాయ‌కులు శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌డం లేదు... అయితే దీనిపై ప‌వ‌న్ ప‌లు పార్టీలు మేధావుల ఆదేశాల‌తో జే.ఎఫ్. ఎఫ్. సీ అనే ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు.. ఇందులో లోక్ స‌త్తా పార్టీ నాయకుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కూడా స‌భ్యులు గా ఉన్నారు.. ఏపీకి విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పిన హామీలు -ఇచ్చిన నిధులు అన్నింటిపై వీరు నిజా నిజాలు నిధులు అన్ని కూలంకుషంగా ప‌రిశీలించి నిజ‌నిర్దార‌ణ చేయ‌నున్నారు. 
 
అయితే ప‌వ‌న్ పై ముందు నుంచి ఉండ‌వ‌ల్లి ప‌లు కామెంట్లు చేసేవారు.. ఆ కామెంట్లు ఎలా ఉన్నా ప‌వ‌న్ ఉండ‌వ‌ల్లి మేధ‌స్సుకు మెచ్చి అపార‌మైన స‌బ్జెక్ట్ ఉన్న వ్య‌క్తిగా ఆయ‌న్ని గుర్తించి, ఆయ‌న‌ను క‌మిటీలో చేర్చుకున్నారు.. అయితే ఆయ‌న పొలిటిక‌ల్ గా ఎవ‌రికి స‌పోర్ట‌ర్ ని కాను, త‌నకు ఏపీ పై ఇష్టం కాబ‌ట్టి, ఇక్క‌డ జ‌రిగే అక్రమాల‌పై గొంతెత్తుతా అని గ‌తంలోనే తెలిపారు.
 
ఇప్పుడు ప‌వ‌న్ తో ఆయ‌న మైత్రి బంధం కొన‌సాగుతోంది... వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఈ ఫ్యాక్ట్ బ‌య‌ట‌కు వ‌స్తాయా అని కూడా అనుకుంటున్నారు నాయ‌కులు. ఇక తాజాగా ఉండ‌వ‌ల్లి చేసిన కామెంట్స్, ఇప్పుడు ఇటు వైసీపీకి తెలుగుదేశానికి జ‌నసైనికుల‌కు కాస్త ఓ క్లారిటీని ఇచ్చాయి అంటున్నారు నాయ‌కులు.... కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి ఇదే సరైన సమయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. 
 
దేశంలో బీజేపీపై అన్ని పార్టీల్లో వ్యతిరేకత ఉందని... అవిశ్వాసం ద్వారా బీజేపీలోని అంతర్గత విభేదాలు బయటకు వస్తాయని ఆయ‌న సంచ‌ల‌న కామెంట్  చేశారు... కాంగ్రెస్‌, వైసీపీ కన్నా టీడీపీ అవిశ్వాసం పెడితేనే మరింత బలం చేకూరుతుందని  ఆయ‌న త‌న  అభిప్రాయాన్ని తెలియ‌చేశారు. పవన్‌, చంద్రబాబు మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లుగా తనకు అనిపించడం లేదని ఆయ‌న వెల్ల‌డించారు.. అందుకే ప‌వ‌న్ ఈ మ‌ధ్య జోరు పెంచారు అని తెలుస్తోంది. ప‌వ‌న్ పై వ‌స్తున్న టీడీపీ ప్యాకేజీ అనే విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న దూరం అవుతున్నారు అని కూడా అంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.