చంద్ర‌బాబుతో ఉండ‌వ‌ల్లి భేటీ కార‌ణం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-17 15:10:49

చంద్ర‌బాబుతో ఉండ‌వ‌ల్లి భేటీ కార‌ణం ఇదే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుని మాజీఎంపీ ఉండ‌వల్లి అరుణ్ కుమార్‌ స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు 45 నిమిషాల‌పాటు సాగింది. ఇక అంద‌రూ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఉండ‌వ‌ల్లి టీడీపీ తీర్థం తీసుకుంటున్నార‌ని మీడియా సైతం అనుకుంది. కానీ అస‌లు కార‌ణం అదికాదు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌పై వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశంలో టీడీపీ ఎంపీల‌తో చంద్రబాబు నాయుడు అవిశ్వాస‌తీర్మానం పెట్టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. 
 
దాని గురించి ఉండ‌వ‌ల్లిని స‌చివాల‌యానికి పిలించుకుని ప‌లు విషయాల‌పై చ‌ర్చించారట ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. అయితే గ‌తంలో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి  విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాలపై  చంద్ర‌బాబుకి  లేఖల‌ను రాసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల‌ను ఒక క్ర‌మ బ‌ద్దీక‌ర‌ణ లేకుండా నాలుగు గోడ‌ల మ‌ధ్య త‌లుపులు మూసేసి విభ‌జించార‌ని దీనిపై విచార‌ణ చేయించాల‌ని అనేక సార్లు మీడియా ద్వారా కూడా స్పందించారు ఉండ‌వ‌ల్లి.
 
కాగా మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌ట్టు సాధించాల‌నే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన రాజ‌కీయ నాయ‌కుల‌ను తిరిగి పార్టీలోకి తీసుకువ‌చ్చేందుకు అధ్య‌క్షుడు రాహూల్ గాంధీ వ్యూహాలు ర‌చిస్తున్న త‌రుణంలో చంద్రబాబు, ఉండవల్లిల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో వారిద్ద‌రు ఏం మాట్లాడుకున్నారు, కేవ‌లం విభ‌జ‌న హామీల గురించేనా లేక టీడీపీలోకి రావాల‌ని సూచించారా, లేదా ఇంకేమైనా అవసరాల రీత్యా లేదా సలహాల కోసం ఆహ్వానించారా అనేది ఇంత వ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేదు. అయితే ఇప్పుడు ఇదే విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.