చంద్ర‌బాబు కోర్టుకెళ్లాలి ఉండ‌వ‌ల్లి ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 18:56:29

చంద్ర‌బాబు కోర్టుకెళ్లాలి ఉండ‌వ‌ల్లి ?

ఏపీ విభ‌జ‌న 2014 లో ఎలా జ‌రిగిందో అంద‌రికి తెలిసిందే... పునఃవ్యవస్థీకరణ బిల్లు -2014ను పార్లమెంటు భయంకరంగా ఉన్న సమయంలో పాస్‌ చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు...  ఆరోజు పార్ల‌మెంట్లో బిల్లు ప్ర‌వేశపెట్టిన స‌మ‌యంలో త‌లుపులు వేసి బిల్లు పాస్ చేశారు, ఆ స‌మ‌యంలో బీజేపీ ఎంపీలు స‌భ‌లో ఉన్నారు గుర్తులేదా అని ఆయ‌న మండిప‌డ్డారు.. ఏపీకి న్యాయం చేస్తాం అని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇంత మౌనంగా ఉంది అని ప్ర‌శ్నించారు..
 
ఇక బీజేపీ ఎటువంటి రాజ‌కీయాలు చేస్తుందో ప్ర‌జ‌లు చూస్తున్నారు, అస‌లు అవిశ్వాస తీర్మానం నిలబ‌డ‌దు అని బీజేపీకి తెలుసు అయినా బీజేపీ ఎందుకు ముందుకురావడం లేదు  అని అన్నారు...అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెల్ లో ఇలా నినాదాలు చేస్తే స్పీక‌ర్ ఓ అధికారంతో  ఏం చేయాలో వారికి తెలుసు అని ఉండ‌వ‌ల్లి తెలియ‌చేశారు.
 
గ‌తంలో ఇలా ఎంపీలు నినాదాలు చేస్తే స‌భ‌లో స‌స్పెండ్ చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి అని ఆయ‌న తెలియ‌చేశారు..ప్రధాని మోదీ చిన్న సైగ చేస్తే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుపడుతున్న అన్నాడీఎంకే ఎంపీలు పక్కకు పోతారని వ్యాఖ్యానించారు. 
 
అవిశ్వాస తీర్మానం పై చ‌ర్చ జ‌ర‌గాలి అని బీజేపీకి లేదు అని ఆయ‌న అన్నారు...అందుకే తాను ఆంధ్రప్రదేశ్‌ పునఃవ్యవస్థీకరణ బిల్లు -2014ను తలుపులు వేసి పాస్‌ చేశారని కోర్టులో కేసు వేసినట్లు చెప్పారు... చంద్రబాబు కూడా అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారని.. తాను వేసిన పిటిషన్‌కు బాబు కౌంటర్‌ వేస్తే బెటర్‌ అని సూచించారు. పార్టీల రాజకీయాలను పక్కన బెట్టి అన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం విషయంలో చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. మ‌రి బాబు ఎటువంటి రూటు చూస్తారో చూడాలి ఉండ‌వ‌ల్లి చెప్పిన స‌ల‌హాకు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.