పార్టీ చేరిక‌పై ఉండ‌వల్లి క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 15:01:22

పార్టీ చేరిక‌పై ఉండ‌వల్లి క్లారిటీ

మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త‌నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డికి న‌మ్మిన బంటుగానే కాకుండా ఆయ‌న‌కు మంచి సల‌హాదారుడుగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఎంపీ ఉండ‌వల్లి... గతంలో రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాదు దేశ రాజ‌కీయాల్లో కూడా మంచి ప‌ట్టున్న నాయ‌కుడు. ఇక వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. అయితే అనేక సంద‌ర్భాల్లో ఎందుకు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నార‌ని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా అందుకు ఆయ‌న స‌మాధానం ఇస్తూ నేను ఎంతో ఇష్ట‌ప‌డే దివంగ‌తనేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ భూమి మీద లేరు కాబ‌ట్టే నేను రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నానంటు చెప్పుకొచ్చారు.
 
ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌కు రాజ‌కీయంగా స‌ల‌హాలు ఇస్తూ వ‌చ్చారు. అంతేకాదు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిర ప్ర‌త్యేక హూదా విష‌యంలో బీజేపీ చేసేది ముందు నుంచి త‌ప్పు అంటూ నాలుగు సంవ‌త్స‌రాల నుంచి ఆయ‌న వాదిస్తూనే ఉన్నారు.
 
అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని కూడా అమ‌రావ‌తి స‌చివాల‌యంలో ఉండ‌వ‌ల్లి క‌లిశారు. ఇక ఆయ‌న ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డంతో ప్ర‌తీ ఒక్క‌రు త్వ‌ర‌లో చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకోబోతున్నార‌ని ప్ర‌తీ ఒక్క‌రు భావించారు. కానీ ఉండ‌వ‌ల్లి తాను ముఖ్య‌మంత్రి ప్రత్యేక హోదా విషయంలో స‌ల‌హాలు సూచ‌న‌లు తెలుసుకునేందుకు న‌న్ను స‌చివ‌లాయానికి పిలిపించుకున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
ఇక పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశంలో టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ తీర్మానంపై కొద్దిరోజుల క్రితం చ‌ర్చ జ‌రిగితే ఈ చ‌ర్చ‌లో గ‌ల్లా స్పీచ్ ఇచ్చారు. ఇక ఆయ‌న స్పీచ్ ఇస్తుండ‌గా తెలంగాణ ఎంపీలు అడ్డు త‌గ‌ల‌డంపై కూడా ఉండ‌వ‌ల్లి ఓ కామెంట్ విసిరారు. ఆ నాడు ప్ర‌ధాని చెప్పిన మాటలు ఇక్కడ స‌భ‌లో చెబుతున్నాం అని గ‌ల్లా అన‌లేదు అని అన్నారు. 
 
దీంతో మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై పంచ్ ప‌డింది. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో ఉండ‌వ‌ల్లి ఏ పార్టీలో చేరుతారా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఇక ఈ ప్ర‌శ్న‌కు ఎట్ట‌కేల‌కు ఉండ‌వ‌ల్లి స‌మాధానం ఇచ్చారు. 
 
తాను రాజ‌కీయాల్లో ఇక లేను…ఏ పార్టీలో నేను చేర‌డం లేదు అని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడున్న స‌మ‌యంలో జ‌గ‌న్ కు ప్ర‌జాద‌ర‌ణ ఎక్క‌వ‌గా ఉంద‌ని అలాగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రాష్ట్రం మొత్తం తిరిగిన త‌ర్వాత ఆయ‌న‌కు ఎంత మాత్రం ప్ర‌జాక‌ర్ష‌న ఉందో తెలుస్తుంద‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.