జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే అది డైరెక్ట్ గా చేస్తా ఉండ‌వ‌ల్లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-06 16:58:53

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే అది డైరెక్ట్ గా చేస్తా ఉండ‌వ‌ల్లి

దేశ రాజ‌కీయాల‌కు రాష్ట్ర రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. ఆయ‌న తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఈ మ‌ధ్య కాలంలో ఉండ‌వ‌ల్లి రీ ఎంట్రీ అంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా మీడియా స‌మేవేశం ఏర్పాటు చేసి స్ప‌ష్ట‌త ఇచ్చారు. తాను వ‌చ్చే ఎన్నిక‌లకు ఏ పార్టీలో చేర‌టం లేద‌ని, రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఇదే క్ర‌మంలో ఉండ‌వ‌ల్లి మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే  ద‌రిదాపుగా త‌న‌కు తెలిసిన వారే మంత్రులు అవుతార‌ని అందువ‌ల్ల తాను ఏదైనా ప‌ని చేయించుకోవాల్సి వ‌స్తే డైరెక్ట్ గా వారి నివాసానికి వెళ్లి తాను ప‌నుల‌ను చేయించుకుంటాన‌ని అన్నారు.
 
అదే మ‌రోసారి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే ర‌హ‌స్యంగా మంత్రుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న ప‌నుల‌ను చేయించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్షంగా ఉన్న చంద్ర‌బాబును విమ‌ర్శించడం ఇందుకు నిద‌ర్శ‌నం అని తెలిపారు. అదే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే తాను ఆయ‌న‌కు క్రెడిట్ కార్డ్ ల మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. 
 
అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తాను ముఖ్య‌మంత్రితో ప‌నులు చేయించుకోలేద‌ని స్పష్టం చేశారు. అంతేకాదు ఇటీవ‌ల తాను చంద్ర‌బాబును మ‌ర్యాద పూర్వకంగా క‌లిశాన‌ని తెలిపారు. గ‌తంలో సీఎం కార్యాలయంలో ఆయ‌న‌ను క‌ల‌వాల‌ని వెళ్తే అపాయింట్‌ మెంట్ తప్ప‌నిస‌రి అని కానీ మొన్న డైరెక్ట్ గా క‌లిశాన‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.