వైఎస్ కు బాబుకు ఇదే తేడా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

difference between chandrababu and ys rajasekhar reddy
Updated:  2018-03-19 16:56:11

వైఎస్ కు బాబుకు ఇదే తేడా

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాజకీయాలలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని నాయ‌కుడు... మ‌హానేత మాజీ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు... అయితే రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ప్ర‌త్య‌క్షంగా ఉండ‌వ‌ల్లి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా, కానీ ప‌రోక్షంగా రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న అక్ర‌మాల‌పై స్పందిస్తూ ఉంటారు.
 
ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన జాయింట్ ఫ్యాక్ట్ క‌మిటీలో  కీల‌క భాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తున్నారు ఉండ‌వ‌ల్లి.... ఈ క‌మిటీలో రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు కేటాయించింది అన్న అంశాల‌ను ప‌రిశీలించారు...అయితే ఉండ‌వ‌ల్లితో పాటు లోక్ స‌త్తా పార్టీ అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌, కుడా ఉన్నారు.
 
అయితే తాజాగా  ఉండ‌వ‌ల్లి ఓ ప్ర‌ముఖ యూ ట్యూబ్ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.. ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ...ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు మాజీ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉంద‌ని అన్నారు... 1995లో చంద్ర‌బాబు, ఎన్టీఆర్ స‌హ‌కారంలో ముఖ్య‌మంత్రి అయ్యార‌ని అన్నారు... 1999 బీజేపీ సానుభూతితో గెలిచారు. కానీ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అలాంటి వారు కాద‌ని 2004 లో మిత్రపక్షాలతో వెళ్లిన,  2009 ఎన్నిక‌లో సొంతంగా పోటీ చేస్తే ఓడిపోతావు అని చెప్పిన విన‌కుండా మొండిగా ముందుకు వెళ్లారు. ఒక‌వేళ పార్టీ ఓడిపోతే నాదీ బాధ్య‌త అని చెప్పి పార్టీని ఒంటి చేత్తో గెలిపించుకొని ముఖ్య‌మంత్రి అయ్యార‌ని అన్నారు
 
అయితే చంద్ర‌బాబు మాత్రం ఎప్ప‌టికీ ఒంట‌రిగా పోటీ చేయ‌డ‌ని ఎవ‌రో ఒక‌రి స‌హాయం త‌ప్ప‌నిస‌రి తీసుకుంటార‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు... 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీతో అలాగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్నార‌ని అన్నారు... అయితే  ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా కేంద్రంతో మిత్ర ప‌క్షంగా లేదు క‌దా అని ఉండ‌వ‌ల్లిని ప్ర‌శ్నించ‌గా... 2019 ఎన్నిక‌ల‌లోపు ముఖ్య‌మంత్రి ఎవ‌రితో ఒక‌రితో క‌లిసి వెళ్తార‌ని, అలాక‌లిసి వెళ్లినా గ‌తంలో రెండు సార్లు ఓట‌మి పాలు అయ్యార‌ని అన్నారు.... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవరు ఒకరితో చంద్ర‌బాబు మిత్ర ప‌క్షం చేసుకుని ఎన్నికలకి  వెళ్తారని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.