చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఉండ‌వ‌ల్లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-21 16:24:23

చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఉండ‌వ‌ల్లి

పోల‌వ‌రం పై చిత్త‌శుద్దిగా ప‌ని చేయ‌కుండా  రోజుకో మాట చెబుతూ ఊస‌ర‌వెల్లిలా త‌యార‌వుతున్నార‌ని చంద్ర‌బాబు పై   మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ దుయ్య‌బ‌ట్టారు....రాష్ట్ర ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కే  పోల‌వ‌రం ప‌నులు రాష్ట్రానికి అప్ప‌గించామ‌ని గ‌తంలో కేంద్రం చాలా స్ప‌ష్టం గా చెప్పింద‌ని ఆయ‌న తెలిపారు... అయితే దానికి విరుద్దంగా పోల‌వ‌రం ప‌నులు త‌న‌కు అప్ప‌గించాల‌ని కేంద్రాన్ని అడ‌గ‌లేదంటూ చంద్ర‌బాబు చెప్ప‌డాన్ని ఉండ‌వ‌ల్లి త‌ప్పుబ‌ట్టారు. పోల‌వ‌రం పై మొద‌ట్నించి చంద్ర‌బాబుది నిర్ల‌క్ష్య వైఖ‌రే అని ఉండ‌వ‌ల్లి తెలిపారు. . 
 
జాతీయ ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం ప‌నులను చంద్ర‌బాబు ఎందుకు చేప‌ట్టార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల పోల‌వ‌రం పూర్తి చేయ‌డానికి త‌క్కువ ధ‌ర‌కే న‌వ‌యుగ‌కు ప‌నులు అప్ప‌గించామ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించిన విష‌యాన్ని ఉండ‌వ‌ల్లి మ‌రోసారి గుర్తు చేశారు....పోల‌వ‌రం ప‌నులను  న‌వ‌యుగ కంపెనీకి స్వ‌యంగా గ‌డ్క‌రినే కేటాయించారని చంద్ర‌బాబు  చెబుతున్న విష‌యాన్ని  మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఖండించారు.
 
పోల‌వ‌రం పై నేను చెప్పిన‌ట్లే జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. చంద్ర‌బాబు 2014లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన  2016 వ‌ర‌కు పోల‌వ‌రం ప‌నులు అస‌లు ప్రారంభించ‌లేద‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు. పోల‌వ‌రం పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ప‌లుమార్లు అడిగినా ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లు చేయ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. వాస్త‌వాల‌ను దాచి రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌ను ఎంత కాలం మ‌భ్య‌పెడ‌తార‌ని చంద్ర‌బాబుని ప్ర‌శ్నించారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి. పోల‌వ‌రం వైఫ‌ల్యానికి టీడీపీ- బీజేపీదే ఉమ్మ‌డి బాధ్య‌త అని అన్నారు. పోల‌వ‌రం పై రాష్ట్ర ప్ర‌జ‌ల‌కున్న అనుమానాల‌ను సీఎం చంద్ర‌బాబు నివృత్తి చేయాల‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కోరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.