స్వ‌రం మార్చిన ఉండ‌వల్లి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 12:52:13

స్వ‌రం మార్చిన ఉండ‌వల్లి

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ  నేత‌ల అవినీతిని ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. అయితే శుక్ర‌వారం నాడు మాత్రం ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా మాట్లాడిన  ఉండ‌వ‌ల్లి కాస్త స్వ‌రం మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది.  
 
రాజ‌కీయ మేధావిగా గుర్తింపు ఉన్న ఆయ‌న  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును వెనుకేసుకుని రావ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు జాతీయ స్ధాయిలో చ‌క్రం తిప్ప‌గ‌ల‌డు.. చంద్ర‌బాబు మీద‌ ఉన్న కేసులు పెద్ద‌వేమీ కావు....ఆయన్ను జైలుకు పంపించేంత తీవ్రమైన కేసులు కావు..ఈ క్ర‌మంలో ఎందుకు కేంద్రంపై గ‌ట్టిగా పోరాడ‌టం లేద‌ని అన్నారు. 
 
పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా  వంటి అనేక వ్య‌వ‌హారాలు  తెర‌పైకి వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి కేంద్రానికి త‌లొగ్గుతున్నాడంటూ గ‌తంలో ఆరోప‌ణ‌లు చేసిన ఉండ‌వ‌ల్లి ఇప్పుడు ఇలా మాట్లాడటం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
చంద్ర‌బాబుకు వ‌త్తాసు ప‌లికిన ఆయ‌న వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. టీడీపీ నేత‌లు మిత్ర‌ప‌క్షంలో ఉన్నారు అందుకే గ‌ట్టిగా అడ‌గ‌లేక‌పోతున్నారు..క‌నీసం మీరైన గ‌ట్టిగా పోరాడండి అంటూ వైసీపీ ఎంపీల‌ను కోరిన‌ట్లు  ఉండ‌వ‌ల్లి  తెలిపారు.
 
అప్పుడు వైసీపీ ఎంపీలు గ‌తంలోనే కాకుండా ఇప్పుడు కూడా పార్ల‌మెంట్ లోప‌ల‌..బ‌య‌టా... కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేసిన కార్య‌క్ర‌మాల‌ను, ప్ర‌సంగాల‌ను చూపించారని ఉండ‌వ‌ల్లి అన్నారు. గ‌త నాలుగేళ్లుగా కేంద్ర ప్ర‌భుత్వం అన్యాయం చేస్తుంటే ఇప్పుడు కూడా మిత్ర ప‌క్షం నుండి బ‌య‌ట‌కు రావాలా.. వ‌ద్దా అంటూ ఆలోచిస్తున్నారు.. ఈ క్ర‌మంలో టీడీపీ పై అనేక అనుమానాలు వ‌స్తున్నాయ‌ని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు. 
 
చ‌ట్టాన్నిఅమ‌లు చేయమ‌ని అడిగేందుకు టీడీపీకి భ‌య‌మేంట‌ని అంటున్నారు ఉండ‌వ‌ల్లి.. ఓ వైపు చంద్ర‌బాబును సమ‌ర్ధిస్తూనే మ‌రోవైపు టీడీపీ పై అనుమానాన్నివ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఇటీవ‌ల ప‌వ‌న్ జేఏసీ అంశం నేప‌ధ్యంలోనే ఉండ‌వ‌ల్లి స్వ‌రం మార్చారా అనే ప్ర‌శ్న ఉద్భ‌వించ‌క మాన‌దు..చూద్దాం మ‌రి మున్ముందు ఉండ‌వ‌ల్లి అడుగులు ఏ విధంగా ఉంటాయే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.