2019లో ఆయ‌నే సీఎం మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి జ్యోస్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-18 18:24:18

2019లో ఆయ‌నే సీఎం మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి జ్యోస్యం

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు.తాజాగా ఆంధ్రజ్యోతి దినపత్రిక-లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం నిర్వహించిన సర్వేలో 175 అసెంబ్లీ సీట్ల‌కు గాను 2019 ఎన్నిక‌ల్లో  టీడీపీ సుమారు 119 సీట్ల‌ను గెల‌వ‌డం ఖాయం అని చేబుతున్నారని అన్నారు.
 
అయితే ఇందులో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు. ఈ సర్వేలో రెండోసారి కూడా చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెప్ప‌డం చాలా విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవ‌రైతే స‌ర్వేల‌ను నిర్వ‌హించి టీడీపీకి 119 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారో అంత‌కు మించిన సీట్లు వైసీపీకి వ‌స్తాయ‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు. అందుకు ఉదాహ‌ర‌ణ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌నేనని అన్నారు.
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ఏ జిల్లాలో అడుగుపెడితే ఆ జిల్లాలో ఇసుకు వేస్తే రాలనంత జ‌నం వ‌స్తున్నార‌ని, దీనిని బట్టి చూడ‌వ‌చ్చ‌ని మ‌ళ్లీ వీళ్లు ప్ర‌త్యేకంగా స‌ర్వేల‌ను నిర్వ‌హించవ‌ల‌సిన‌ అవ‌స‌రం లేద‌ని అన్నారు. 2019లో ఖచ్చితంగా వైసీపీనే అత్య‌ధిక మెజారిటితో గెలుస్తుంద‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు. 
 
అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌తాపం చూపుతార‌ని అన్నారు. ఇక తాను ఈ వ్యాఖ్య‌లు చేస్తుంటే చాల‌మంది తిరిగి ఉండ‌వ‌ల్లి రాజ‌కీయాల్లో వ‌స్తార‌ని అంటున్నార‌ని అన్నారు. అయితే తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని గతంలో తాను 10 సంవ‌త్స‌రాలు ఎంపీగా ప్ర‌జ‌ల‌కు సేవ‌చేశాన‌ని, ఇప్పుడు త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.