జగన్ కి ఉండవల్లి సలహా..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-19 16:05:46

జగన్ కి ఉండవల్లి సలహా..?

ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు...రెండు సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన వైయస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు... రాజశేఖర్ రెడ్డి, కేవీపీ చలవతోనే రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీకి పోటీ చేయగలిగాను అని గర్వంగా చెప్పిన నాయకుడు. ప్రస్తుత వాస్తవిక రాజకీయాలపై మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ తనకు ఒక‌ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు... ఆయన నిక్కచ్చిగా, లెక్కలతో సహా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంతో యువకులలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది...
 
టీడీపీ నాయకులు తన కుల మీడియాని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని డప్పు వేయిస్తారు... ఈ వ్యాఖ్యలపైనా ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్‌కు సలహా ఇచ్చారు... టీడీపీ వాళ్ళు లక్ష కోట్లు లక్ష కోట్లు అంటున్నారు...అసలు ఛార్జ్ షీటులో ఉన్నదే 1300 కోట్లు అందులో 500 కోట్లకు ఛార్జ్ షీట్లు కొట్టేసారు. ఎవరైనా రసీదు ఇచ్చి లంచం తీసుకుంటారా చెప్పండి...జగన్ కి చెప్పుకోవడం రాలేదు అంతే...
 
అయితే ఆరోప‌ణ‌ల‌ను మాత్రం ప్ర‌జ‌లు న‌మ్మ‌తున్నారు.. జగన్ లక్ష కోట్ల ఆరోపణలపైన అసెంబ్లీలో టీడీపీ నాయ‌కుల‌కు సవాల్ విసిరారు...అలాగే ప్రజల్లోకి వచ్చి ఆరోపణలను నిరూపించమని సైకిల్ పార్టీకి సవాల్ విసిరితే జగన్ మైలేజ్ మరింత పెరుగుతుంది... ఆ దెబ్బతో టీడీపీ ఇరుకున పడుతుంది... అలా చేస్తే జగన్ న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకోవచ్చు అని జగన్ కి సలహా ఇచ్చారు ఉండవల్లి...అంతే కాకుండా టీడీపీ చేస్తున్న అవినీతితో, వారు ఇచ్చిన తప్పుడు హామీలతో జగన్ ఓటు బ్యాంకు మరింత పెరిగింది.. అందుకే జగన్ పాదయాత్రలో జనసంద్రోహం వెల్లువలా వస్తుందని చెప్పారు...

షేర్ :

Comments

1 Comment

  1. Super

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.