నాని జాగ్ర‌త్త‌గా మాట్లాడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-26 16:30:47

నాని జాగ్ర‌త్త‌గా మాట్లాడు

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కృష్ణా జిల్లాలో జ‌గ‌న్ కు జ‌నం నీరాజ‌నం ప‌డుతున్నారు.. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో హైలెట్ గా నిలుస్తున్న కొడాలి నాని తాజాగా గ‌న్న‌వ‌రంలో జ‌రిగిన స‌భ‌లో మాట్లాడారు... ఆ స‌మ‌యంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మండిప‌డ్డారు..తనకు స్నేహితుడు అంటూనే నాని చేసిన విమర్శలను  ఆయన తీవ్రంగా ఖండించారు.
 
నోరు అదుపులో పెట్టుకో  లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి  అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఉద్దేశించి వల్లభనేని వంశీ తీవ్రంగా హెచ్చరించారు. అయితే గ‌తంలో పార్టీలో ఉన్నా స్నేహితులుగా ఇద్ద‌రం ఉన్నామాట వాస్త‌వ‌మే.. అయితే త‌న‌పేరు చెప్పి స్నేహితుడు అంటూనే త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబుని దూషించ‌డం పై ఆయ‌న మండిప‌డ్డారు.
 
కొడాలి నాని పిచ్చికుక్కలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ, చంద్రబాబుతో తప్పితే నానితో స్నేహమే లేదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నానిని, వైసీపీలో బరితెగించి మాట్లాడేవారిని జగన్‌ కంట్రోల్‌ చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
 
అయితే  పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ వెంటే ఉంటున్న నాని ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడు తెలుగుదేశం నాయ‌కులు ఎందుకు దీనిపై స్పందించ‌లేదు అని అధిష్టానం అనేస‌రికి వంశీ ఈ విధంగా స్పందించి ఉంటార‌ని, నాని అంటే అభిమానం ఎమ్మెల్యే వంశీకి ఎంత ఉంటుందో త‌మ‌కు తెలుసు అంటున్నారు నాని అభిమానులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.