వైసీపీపై రాధా అసంతృప్తి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vangaveeti radha and ycp
Updated:  2018-09-17 15:06:33

వైసీపీపై రాధా అసంతృప్తి

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ అసెంబ్లీ సీటు ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి. 2019 స్వార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌ల్లాది విష్ణుని బ‌రిలోకి దించాల‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుండ‌టంతో వంగ‌వీటి రాధ ఆసంతృప్తితో ఉన్నారు. దీంతో  వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ క్ర‌మంలో రాధాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉండ‌టంతో అనుచ‌రుత‌లో ఆయ‌న స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. 
 
అసంతృప్తుల వ్యవ‌హారం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైఎస్సార్ కార్య‌క్ర‌మంపై పడింది. ఇక సెంట్ర‌ల్ సిటీ పంచాయితీ తేల‌క‌పోవ‌డంతో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మానికి మ‌ల్లాదితో పాటు వంగ‌వీటి రాధ‌కూడా దూరంగా ఉన్నారు. వైసీపీ తీరుపై అసంతృప్తితో ఉన్న వంగ‌వీటి రాధను పార్టీలో తీసుకువ‌చ్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కూడా ఫ‌లితం లేకుండా పోతుంది.
 
గ‌తంలో కూడా రాధాను సైకిల్ ఎక్కించేందుకు పార్టీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌లం అయ్యారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో మ‌రోసారి తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు జ‌రిపినా సెంట్ర‌ల్ ఎమ్మెల్యే టీడీపీ సిట్టింగ్ కావ‌డంతో రాధా వ‌స్తే ప‌రిస్థితి గంద‌రగోళంగా మారుతుంద‌ని తెలుస్తుంది.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.