పార్టీ మారే చాన్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 16:15:24

పార్టీ మారే చాన్స్ ?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌లో వ‌ర్గ విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ వ‌ర్గ విభేదాల వ‌ల్ల ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కుల్లో నువ్వేంత అంటే నువ్వేంత అన్న‌ట్లు వ్యవ‌హ‌రిస్తున్నారు పార్టీ నాయ‌కులు.. ఇక ఇప్ప‌టికే క‌ర్నూల్ జిల్లా ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి చేర‌డంతో మంత్రి అఖిల ప్రియ‌ని ఏ.వీ సుబ్బారెడ్డిని అమ‌రావ‌తికి పిలించి వారిని క్లాస్ తీసుకున్నారు. 
 
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు త‌గాదాలు పెట్టుకుని నియోజ‌కవ‌ర్గంలో వ్య‌వ‌హ‌రిస్తే పార్టీకి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని, ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏదైనా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తే క‌లిసి పాల్గొనాల‌ని చంద్ర‌బాబు వారికి సూచించారు. అయితే చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు అమ‌రావ‌తిలో త‌ల ఊపినా కానీ, వారం గ‌డువ‌క ముందే మ‌ళ్లీ   వీరిద్ద‌రి మ‌ధ్య త‌గాదాలు చోటు చేసుక‌న్నాయి. దీంతో ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ చంద్ర‌బాబు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఇక ఈ పంచాయితీ పూర్తికాక ముందే చంద్ర‌బాబుకు మ‌రో పంచాయతీ వెలుగు చూసింది.
 
తాజాగా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో కూడా వ‌ర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. చాలా కాలంగా సీఎం ర‌మేష్ కు ప్రొద్దుటూరు ఇంచార్జ్ వ‌ర‌దరాజుల రెడ్డి మ‌ధ్య వ‌ర్గ విభేదాలు త‌లెత్తుతున్నాయి.. వాస్త‌వానికి వీరిద్ద‌రు అధికార తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. కానీ నువ్వేంత అంటే నువ్వేంత అన్న చందంగా మీడియా స‌మ‌క్షంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.
 
అయితే ఈ క్ర‌మంలో వ‌ర‌ద‌రాజుల రెడ్డి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి సీఎం ర‌మేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నీ అబ్బ జాగిరి అనుకుంటున్నావా అని సీఎం ర‌మేష్ పై నిప్పులు చెరిగారు. అలాగే తాను టీడీపీలో ఉంటానో ఉండనో కూడా తెలియదని, అయినా సరే సీఎం రమేష్ చేస్తున్న అన్యాయాన్ని మాత్రం చూస్తూ సహించే ప్రసక్తే లేదని స్ప‌ష్టం చేశారు. అలాగే ప్రొద్దుటూరులో సీఎం ర‌మేష్ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకునేందునే ప్ర‌య‌త్నిస్తే చూస్తూ ఊరుకోమ‌ని, ఆయ‌న‌ను ఎదిరించి క‌దంతోక్కుతామ‌ని వ‌ర‌ద‌రాజుల రెడ్డి హెచ్చ‌రించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.