వైసీపీకి ట‌చ్ లో సీఎం ర‌మేష్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 14:15:09

వైసీపీకి ట‌చ్ లో సీఎం ర‌మేష్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార టీడీపీ రాజ‌కీయ నాయ‌కుల్లో గ్రూప్ రాజకీయాలు ర‌చ్చ‌బండ‌కు ఎక్కుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయిన‌ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను ఏర్పాటు చెయ్యాల‌ని సూచించారు. పార్టీ అధినేత కోరిక మేర‌కు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,  ఇంచార్జ్ లు మ‌హానాడు స‌భ‌ల‌ను నిర్వ‌హించారు. 
 
అయితే కొన్నిచోట్ల ఈ స‌భ‌ను వేదిక‌గా చేసుకుని టీడీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఘ‌ట‌నలను అధిష్టానం మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటు చేసుకుంది. ఘ‌ట‌న‌ పాతదే అయినా ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త‌దిగా మారిపోయింది. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ కు అదే పార్టీకి చెందిన వరదరాజులు రెడ్డిల మ‌ధ్య వైర్యం రోజు రోజుకు ప‌చ్చ గ‌డ్డివేస్తే భ‌గ్గుమ‌నేంత‌లా మారుతోంది.
 
కొంత‌ కాలంపాటు వీరిద్ద‌రి వ్య‌వ‌హారం కాస్త నిల‌క‌డ‌గా న‌డిచినా కూడా తెర మీద ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోలేదు. అయితే ఈ క్ర‌మంలో వ‌ర‌ద‌రాజులు రెడ్డి అదును చూసుకుని ర‌మేష్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ర‌మేష్ కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు ద‌య‌తో ఏంపీ అయ్యార‌ని ఆయన విమ‌ర్శ‌లు చేశారు.
 
రమేష్ గ్రామ‌స్థాయికి ఎక్కువ మండ‌ల స్థాయికి త‌క్కువ అని వ‌ర‌ద‌రాజులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. గతంలో సీఎం ర‌మేష్ నాయుడు త‌న వ‌ర్గం వారిని డ‌బ్బుల‌తో కొనుక్కున్నార‌ని మండిప‌డ్డారు. అంతేకాదు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లుకు ట‌చ్ లో ఉన్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీ సీఎం ర‌మేష్ ఏ మాత్రం దోహ‌ద‌ప‌డ‌ర‌ని వ‌ర‌ద‌రాజులు రెడ్డి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.