వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 15:57:42

వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ ద‌ళిత తేజం పార్టీ అని అనేక స‌భ‌ల్లో ప్ర‌చారం చేసుకునే అధికార పార్టీ నాయ‌క‌లు, ఇప్పుడు ఎక్క‌డైనా ద‌ళితులు క‌నిపిస్తే వారిపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక తాజాగా  ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య కూడా ద‌ళిత విద్యార్థి పై కులం పేరుతో దూషించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళితులు నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.  
 
కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్‌ తనిఖీ నిమిత్తం వచ్చిన వర్ల రామయ్య అక్కడ ఆగి ఉన్న బస్సులోకి వెళ్లారు. అయితే ఆదే బ‌స్సులోనే ఒక విద్యార్థి ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని త‌న మొబైల్ ఫోన్ లో పాటలు వింటున్నారు. త‌నిఖీని నిర్వ‌హిస్తున్న వ‌ర్ల రామ‌య్యకు మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌యాణికులు లేచి నిబ‌డ్డారు.. కానీ  ఈ విద్యార్థి మాత్రం వ‌ర్ల త‌నిఖీకి వ‌చ్చార‌ని గ‌మ‌నించ‌లేదు.. దీంతో రామ‌య్య‌ తనను చూసి సీటులో నుంచి లేవలేదని భావించి ఇయర్‌ ఫోన్స్‌ లాక్కుని తన చెవికి పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత త‌న నోటికితో ఆ విద్యార్థికి ప‌ని చేప్పారు.
 
నీకు ఫోన్‌ ఎందుకురా..? ఎస్సీనా నువ్వు.? మాలా? మాదిగా? అని ఆ విద్యార్థిని నిలదీశారు వ‌ర్ల రామ‌య్య‌. తాను మాదిగనని ఆ యువకుడు చెప్ప‌గా. వర్ల మరింత రెచ్చిపోయారు. మాదిగ నా.. కొ.. అస్సలు చదవరు. బాగుపడరు.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ద‌ళిత తేజం పార్టీ అని ప్ర‌చారం చేసుకునే టీడీపీ నాయ‌కులు ఇలా ద‌ళితుల‌ను దూషించి మాట్లాడ‌డం చాలా సిగ్గుచేటుగా ఉంద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.