ఏపీ ఎంపీల‌పై వ‌ర్మ వ్యంగ్యాస్త్రాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 12:10:10

ఏపీ ఎంపీల‌పై వ‌ర్మ వ్యంగ్యాస్త్రాలు

స‌మాజంలో జ‌రుగుతున్న ప్ర‌తి అంశాన్ని గ‌మ‌నిస్తూ దానిపై  స్పందించ‌డం  ద‌ర్శ‌కుడు  రామ్  గోపాల్ వ‌ర్మ ఆన‌వాయితీ. ప్ర‌స్తుతం రాజ‌కీయాల పై ఫోక‌స్ చేశారు  వ‌ర్మ‌. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఏపీకి జ‌రిగిన అన్యాయం పై రాష్ట్ర ఎంపీలు ఆందోళ‌న చేసిన విష‌యం తెలిసిందే.  కేంద్రం పై ఉన్న అస‌హ‌నాన్ని పూర్తి స్థాయిలో వెళ్ల‌గ‌క్కి రాష్ట్ర ప్ర‌జ‌లను, పార్టీ అధిష్టానాన్ని మెప్పించారు  టీడీపీ ఎంపీలు.
 
ఏపీ ఎంపిలు చేసిన ఆందోళ‌నపై వ‌ర్మ  త‌న‌దైన శైలిలో స్పందించారు.  పార్ల‌మెంట్‌లో వీళ్ల వింత‌ ప్ర‌ద‌ర్శ‌న చూసిన మోదీ ఏపీని త‌క్కువ అంచ‌నా వేసి ఉండ‌వ‌చ్చ‌ని అర్ధం కాని  వ్యాఖ్యలు  చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు దేశం పార్టీకి, తెలుగు ప్ర‌జ‌ల‌కు ఉన్న గొప్ప‌త‌నాన్ని జాతీయ స్థాయిలో త‌గ్గించారంటూ  వెటకారంగా ట్వీట్‌ చేశారు. దీంతో పాటు ఏపీ ఎంపీల‌ను జోక‌ర్ల‌తో పోల్చారు వ‌ర్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.