వైసీపీలోకి టీడీపీ కీల‌క నేత ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 15:15:10

వైసీపీలోకి టీడీపీ కీల‌క నేత ?

కృష్ణాజిల్లాలో ఇటీవ‌ల యల‌మంచిలి ర‌వి వైసీపీలో చేర‌తారు అని అనేక వార్త‌లు వ‌చ్చాయి... చివ‌ర‌కు ఆయ‌న నాకు పార్టీ మారాలి అని ఉంది కాని బాబుగారు ఇచ్చిన హామీతో పార్టీలో కొన‌సాగుతాను అని ఆయ‌న తెలియ‌చేశారు. ఇక తాజాగా  రాష్ట్ర మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, సీనియర్‌ నేత వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం నుంచి వైసీపీలో చేర‌డానికి సిద్దం అవుతున్నారు.
 
కొన్ని రోజుల నుంచి వైసీపీలో ఆయ‌న చేర‌డానికి మంత‌నాలు జ‌రుపుతున్నారు..ఇక వ‌చ్చేవారం వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కృష్ణాజిల్లాలో పాద‌యాత్ర చేయ‌నున్నారు ఆ స‌మ‌యంలో ఆయ‌న జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతారు అని తెలుస్తోంది. ఆయ‌న పొలిటిక‌ల్ లైఫ్  ప‌రిశీలిస్తే...1999 ఎన్నికల్లో నందిగామ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు.. ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు.
 
ఇక‌  2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారు ఆ స‌మ‌యంలో  గుంటూరు-2 స్థానం నుంచి కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దించాలని టీడీపీ యోచించింది.కాని చివ‌రి నిమిషంలో బాబు డెసిష‌న్ మార్చుకున్నారు.ఆయ‌న‌కు గుంటూరు 2 టికెట్ ఇవ్వ‌లేదు. కాని తెలుగుదేశంలో ఆయ‌న‌కు నందిగామ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించిన బాబు, ఆయ‌న‌ను  తంగిరాల ప్ర‌భాక‌ర్  గెలుపుకు సాయం చేయాల‌ని తెలియ‌చేశారు.
 
ఇక తంగిరాల  గెలుపునకు కృషి చేశారు. తంగిరాల ప్రభాకరరావు మరణించిన తర్వాత ఉప ఎన్నికల నుంచి ఆయన్ను దూరంగా ఉంచారు. పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యమివ్వలేదు. ఉప ఎన్నిక‌ల్లో తంగిరాల ప్ర‌భాక‌ర్ కుమార్తె సౌమ్య గెలుపొందారు... ఇక ఆయ‌న తెలుగుదేశం నుంచి ఇప్పుడు వైసీపీలో చేరాలి అని ఆలోచిస్తున్నారు.. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌రైన స‌మ‌యం అని ఆయ‌న భావిస్తున్నారు... జిల్లాలో ఏదో సెగ్మెంట్ నుంచి ఆయ‌న పోటీ చేయ‌డం ఖాయం అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.