రేపు వైసీపీలో చేరుతా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 17:14:02

రేపు వైసీపీలో చేరుతా

సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు, ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నారు. ఈనెల 10న వైసీపీలో చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు.
 
రేపు ఉదయం కైకలూరు నియోజకవర్గంలో పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టుగా కృష్ణ ప్రసాద్‌ ప్రకటించారు. నందిగామ మండలం ఐతవరంలోని వసంత ఇంటి నుంచి భారీ ర్యాలీతో కైకలూరు వెళ్లేందుకు అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు.  ఇప్ప‌టికే ఆయ‌న కైక‌లూరు వ‌స్తున్న‌ట్టు వైసీపీ నాయ‌కుల‌కు తెలియ‌చేశారు.
 
ఇక ఆయ‌న    1999 ఎన్నికల్లో నందిగామ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. తర్వాత  2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారు. గుంటూరు-2 స్థానం నుంచి కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దించాలని టీడీపీ నాయ‌క‌త్వం ముందు భావించింది. అయితే ప‌లు రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల ఆయ‌నకు చివ‌రి నిమిషంలో సీటు రాలేదు. 
 
ఆ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు చంద్ర‌బాబు. అక్క‌డ నుంచి తెలుగుదేశం అభ్య‌ర్ది తంగిరాల గెలుపునకు ఆయ‌న‌ కృషి చేశారు. త‌ర్వాత  తంగిరాల ప్రభాకరరావు మరణించిన తర్వాత ఉప ఎన్నికల నుంచి ఆయన్ను దూరంగా ఉంచారు తెలుగుదేశం స్దానిక కేడ‌ర్.
 
ఆయ‌న పార్టీలో ఈ నాలుగేళ్లు క‌లిసి ప‌నిచేసినా పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యమివ్వలేదు ఆయ‌న‌కు. తర్వాత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఆయ‌న . ఒకటి, రెండు సందర్భాల్లో కృష్ణప్రసాద్‌ను జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. వ్యాపారరీత్యా వైఎస్‌ కుటుంబంతో కృష్ణప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఆయ‌న పార్టీలోకి వ‌స్తే  ఆయనకు టికెట్ ఇస్తామ‌ని తెలియ‌చేశార‌ట‌. ఇక  మైలవరం నుంచి శాసనసభకు లేకపోతే విజయవాడ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారంటున్నారు జిల్లా వైసీపీ నాయ‌కులు, వ‌సంత అనుచ‌రులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.