బాబు నీకు దమ్ముందా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 16:49:04

బాబు నీకు దమ్ముందా

రాష్ట్రాన్ని అవినీతి మయంలో నడిపిస్తూ, నేను అవినీతి రహిత పాలనను చేస్తున్నాను అని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఒక వైపేమో నేను నిప్పు అని చెప్పుకుంటారు, మరో వైపు చూస్తే అన్ని నివేదికలలోను అవినీతి చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ.
 
మీరు నిజంగా నిప్పే అయితే, 18 కేసులలో స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు, మీకు దమ్ముంటే విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు వాసిరెడ్డి పద్మ.. మీ జీవితమంతా కేసులకు బయపడి న్యాయవ్యవస్థను మభ్యపెట్టి, స్టేలు తెచ్చుకోవడానికి సరిపోతుంది, మీ సొంత వాళ్లే మీ పైన ఆరోపణులు చేస్తుంటే మీకు ఏమి పట్టనట్లుగా తిరుగుతున్నారని బాబును విమర్శించారు ఆమె...
 
చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోక, ఇప్పుడు దేవాలయాల‌పైన పడ్డారని అన్నారు.. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ఆమె అన్నారు.. స్వామి ఆభరణాలు దోచుకున్నారని తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు.దాని పైన సిబిఐ విచారణ జరపాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.