విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన ఐఏఎస్ రాజ‌మౌళి ఎవ‌రంటే?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-23 04:27:24

విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన ఐఏఎస్ రాజ‌మౌళి ఎవ‌రంటే?

ఏపీలో అధికారులు తెలుగుదేశానికి కొమ్ముకాస్తున్నార‌ని, కొంద‌రు అధికారుల తీరును వైసీపీ నాయ‌క‌త్వం త‌ప్పుప‌ట్టింది. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌దిగా ఉండ‌వ‌ల‌సిన అధికారులు, ఇటువంటి ప‌నులు చేయ‌డం పై వైసీపీ నాయ‌కులు ఫైర్ అవుతున్నారు.. తాజాగా ఐఏఎస్ అధికారులు తెలుగుదేశానికి కార్య‌క‌ర్త‌ల్లా ప‌నిచేస్తున్నారు అని వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి మండిప‌డిన విష‌యం తెలిసిందే.
 
ఐఏఎస్‌లు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్‌, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో ఉన్నారని విజయసాయిరెడ్డి వారి పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించారు.. దీనిపై ఐఏఎస్ ల సంఘం మండిప‌డినా, త‌న ద‌గ్గ‌ర సాక్ష్యాధారాలు ఉన్నాయి అని విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌డంతో ... అధికారులు కూడా స్ద‌బ్దుగా ఉన్నారు.
 
తాజాగా ఈ వివాదం పై ఓ టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం త‌ర‌పున వ‌ర్గ‌రామ‌య్య హాజ‌ర‌య్యారు... వైసీపీ త‌ర‌పున వాసిరెడ్డి ప‌ద్మ హాజ‌ర‌య్యారు.. ఈ స‌మ‌యంలో వ‌ర్గ రామ‌య్య తెలుగుదేశాన్ని స‌పోర్ట్ చేసి ఐఏఎస్ లు చేసేది క‌రెక్ట్ అని అన్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో తెలుసుకుని సీఎంకు తెలియ‌చేస్తారు అని ఆయ‌న వంత‌పాడారు. దీనిపై వాసిరెడ్డి ప‌ద్మ‌ ఫైర్ అయ్యారు.
 
అక్క‌డ  వ‌ర‌కూ చేస్తే ఒకే, కాని కొంత మంది అధికారులు ఓ అడుగు ముందుకు వేసి వైసీపీ ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించేలా చేయ‌డం, వారితో భేర‌సారాలు మంత‌నాలు జ‌ర‌ప‌డం  మంచి ప‌ద్దతా అని ప్ర‌శ్నించారు.. ఇక కొంద‌రు ఐపీఎస్ లు అక్రమంగా వైసీపీ నాయ‌కుల పై కేసులు పెడుతున్నారు అని, ఆమె విమ‌ర్శించారు. బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న‌కు అనుకూలంగా ఉండే వారిని ప‌క్క‌న పెట్టుకుంటున్నారని, ఇత‌ర రాష్ట్రాల నుంచి ఇక్క‌డ‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు అని ఆమె అన్నారు.
 
ఇక ఐఏఎస్ రాజమౌళి యూపీ కేడర్‌కు చెందిన వారని... ఆయ‌న్ని కూడా ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చారు.. ఆయ‌న తెలుగుదేశం ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు ద‌గ్గ‌ర బంధువు అని ఓ సీక్రెట్ ను చెప్పారు వాసిరెడ్డి ప‌ద్మ‌... అందుకే రాయ‌పాటి వెంట‌నే డీజీపికి విజ‌య‌సాయిరెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి అంటూ లేఖ‌రాశారు అని చ‌ర్చ వ‌స్తోంది.  తీగ‌లాగితే డొంక క‌ద‌ల‌డం అంటే ఇదే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.