వెంకయ్యనాయుడు నుంచి చంద్ర‌బాబుకు ఫోన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

venkaiah naidu and chandrababu naidu image
Updated:  2018-03-09 05:14:46

వెంకయ్యనాయుడు నుంచి చంద్ర‌బాబుకు ఫోన్

కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి వైదొలిగిన టీడీపీకి మిత్ర‌ప‌క్ష‌మైన  బీజేపీ కూడా వెంట‌నే షాక్‌ ఇచ్చింది... అయితే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌ను ఉద్వేగానికి  గురి చేస్తున్నాయి... దీనికి కార‌ణం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను బాధ్య‌త‌గా తీసుకుని ప‌రిపాల‌న చేయాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం దాన్ని విస్మ‌రించింది. అలాగే దేశాన్ని న‌డిపించే కేంద్ర ప్ర‌భుత్వం పై న‌ష్టపోయిన రాష్ట్రాల‌ను అదుకోవాల్సిన క‌నీస బాధ్య‌త ఉంది. 
 
అయితే గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన వాగ్దానాల‌ను కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాటిని అమ‌లు చేయ‌డంలో ఘోరంగా విఫ‌లం అయ్యాయి... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల‌లో బీజేపీ-టీడీపీ పొత్తుకుద‌ర‌డానికి  ఏపీలో  బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కీల‌క పాత్ర పోషించారు. భాగ‌స్వామ్యంగా ఉన్న ఇరు పార్టీలు అధికారంలోకి రావ‌డంతో ఏపీ మంత్రి వ‌ర్గంలో బీజేపీ నాయ‌కులకు, కేంద్ర మంత్రి వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించుకున్నారు మిత్ర‌బంధంతో.
 
దీనికి ప్ర‌ధాన కార‌ణం వెంక‌య్య‌నాయుడు. అయితే వివిధ కార‌ణాల దృష్ట్యా  బీజేపీ అధిష్టానం వెంక‌య్య‌నాయుడుకు ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి అప్ప‌గించింది....అప్ప‌టి నుంచి ఏపీ పై కేంద్ర ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని మార్చుకుంది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయ‌కులు సైతం టీడీపీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు.
 
ఇక ప్ర‌ధానంగా రాష్ట్ర విభజ‌న స‌మ‌యంలో ఏపీకి కేటాయించిన విభజ‌న చ‌ట్టంలోని అంశాలు, ప్ర‌త్యేక‌హోదాలాంటి అంశాలు రాష్ట్రానికి అమ‌లు చేయ‌డం పై కేంద్రం క‌న్నెర్ర చేసింది. ఇక తాజాగా అరుణ్‌ జైట్లీ ప్ర‌క‌ట‌న త‌రువాత టీడీపీ కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న త‌మ మంత్రుల‌ను రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించింది.. దీనికి ముందు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు సీఎం చంద్ర‌బాబుకు ఫోన్ చేశారట‌.
 
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తున్నాయని అన్నార‌ట‌. ఇక ఏపీ ప‌ట్ల అనుస‌రిస్తున్న తీరు మంచిది కాద‌ని చెప్పినా ప్ర‌ధాని  మోడీ- అమిత్ షా వినేందుకు సిద్ధం గా లేరని వెంకయ్య చంద్రబాబుకు వివరించారట. రాజ్యాంగ ప‌ద‌విలో ఉండ‌డం వ‌ల‌న రాష్ట్రానికి న్యాయం చేయ‌లేక పోతున్నాని అన్నార‌ట‌... దీనికి స్పందించిన చంద్ర‌బాబు ప‌ర్వాలేదంటూ చెబుతూ ఇక బీజేపీతో యుద్ధమేనని తేల్చిచెప్పేశారట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.