ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నువ్వే రావాలని పిలుపునిస్తున్నావు బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-10-11 11:57:28

ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నువ్వే రావాలని పిలుపునిస్తున్నావు బాబు

ఏపీ ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ ల‌పై వ‌రుస ట్వీట్ ల‌తో దుమ్మెత్తి పోశారు. బాబు వస్తేనే...జాబులు అన్నారు. కొత్త జాబుల సంగతి దేవుడెరుగు,  ఉన్న జాబులు కూడా పోయాయి. బాబు వేల మంది తాత్కాలిక ఉద్యోగుల జాబులు ఊడబెరికారు. ఇప్పుడు కొత్త జాబులకు కూడా పాడేశారు. అయినా  ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నువ్వే రావాలని పిలుపు ఇస్తున్నారు.
 
చరిత్రలో ఏ సీఎం చేయనతంగా బాబు 4 ఏళ్ళలో 1 లక్షా 32 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఏం చేశారు ఈ నిధులన్నింటినీ? ఎక్కడైనా ఒక్క భారీ ప్రాజెక్ట్‌ కట్టారా? అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా వచ్చిందా? అప్పులు బారెడు -అభివృద్ధి మూరెడు! బాబు మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు!
 
సేద్యంలో బాబుకు అవార్డు...వినూత్న ఆలోచనల్లో లోకేశ్ కు సింగపూర్‌ ఫెలోషిప్‌(ట)!. తండ్రీకొడుకులిద్దరూ రేయింబవళ్ళు అవార్డుల కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఈ అన్నదాతలు, నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాలు ఆదుకోమని అలమటించడం ఏమిటి? అవార్డులు, రివార్డులు చూసి ఆనంద బాష్పాలు రాల్చకుండా అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.