బాబు, లోకేశ్ ల‌కు విజ‌య‌సాయి రెడ్డి చివ‌రి ఆప్ష‌న్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-27 17:32:08

బాబు, లోకేశ్ ల‌కు విజ‌య‌సాయి రెడ్డి చివ‌రి ఆప్ష‌న్స్

అధికారులు కృష్ణా జిల్లాలో ర‌క్తంతో వ్యాపారం జ‌రిపించ‌డం ప‌ట్ల ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో డెంగీ విస్త‌రించినా కూడూ దానిని నియ‌త్రించ‌క‌పోవ‌డం దారుణం అని ఆయ‌న ఆయ‌న ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా కూడా స్పందించారు. 
 
ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలోని ప్ర‌జ‌ల‌కు డెంగీ జ్వ‌రం రావ‌డంతో ర‌క్త‌పు ప్లేట్ లెట్ల విష‌యంలో కృత్రిమ కొర‌తను సృష్టిస్తున్నార‌ని విజ‌యసాయి రెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌తి యూనిట్ ర‌క్తానికి 6 వేల‌నుంచి 10 వేల వ‌ర‌కు వ‌సులు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వైద్య‌, ఆరోగ్య శాఖ‌కు కూడా నిర్వ‌హిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్న చోటే ఇలా జ‌రుగుతోంది. ఇక రాష్ట్రంలో మీ పాల‌న ఏవిధంగా సాగుతుందో దీనిని బ‌ట్టి అర్థం అవుతోందిన విజ‌య‌సాయి రెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. 
 
మ‌రో ట్వీట్ చేస్తూ ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ పై స్పందించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిన వెంట‌నే... నారా లోకేశ్ నాయుడు త‌న పార్టీ అమెరికాలో అధికారంలోకి ఎలా రావాలో ఆలోచిస్తు ఉంటాడు మ‌రి చంద్ర‌బాబు ఏదేశానికి అధ్య‌క్షుడు కావ‌ల‌నుకుంటాడు.
 
ఆప్ష‌న్ -ఏ- స్విట్జ‌ర్లాండ్ 
ఆప్ష‌న్ -బీ- సింగ‌పూర్
ఆప్ష‌న్ -సీ- మ‌లేసియా
ఆప్ష‌న్ -డీ- జ‌పాన్ అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.