సీన్ మారింది.. రేపటి ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..!

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp
Updated:  2018-10-09 03:20:55

సీన్ మారింది.. రేపటి ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..!

ఆరు నూరు అయినా రేపటి ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని క్లారిటీగా ధీమాగా చెప్పేశారు రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి. విశాఖలో పార్టీ మీటింగులో మాట్లాడిన ఆయన టీడీపీ పై ఎంతటి వ్యతిరేకత ఉందో, ఏపీలోని పదమూడు జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ఒకేలా బ్రహ్మరధం పడుతున్న జనాలను చూస్తే తెలుస్తుందని అన్నారు.
 
మరో ఆరు నెలల్లో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది వైసీపీయేనని కేవలం ఒక్క విశాఖలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లను సాధిస్తామని ఇందుకు కంచరపాలెంలో జరిగిన జగన్ మీటింగ్ కి వచ్చిన జ‌న‌సందోహమే ఉదాహరణ అని ఆయన చెప్పారు. జనం ఆ మీటింగుకు పోటెత్తారని, టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయని గతంలో టీడీపీకి  తాము విశాఖలో అన్ని సీట్లు గెలుస్తామన్న ధీమా ఉండేదని జగన్ పాదయాత్రతో అది తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు..  జగన్ అధికరంలోకి వస్తే మూడు దశాబ్దాల పాటు ఏపీని పాలిస్తారని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.. ప్రజలకు మంచి పాలన అందించే సత్తా జగన్ కే ఉందని అన్నారు. 
 
జగన్ వస్తే టీడీపీ అరాచకాలపై విచారణ జరిపిస్తామని, ఇప్పటి నుంచే పెట్టే బేడా సర్దుకోకుండా ముఖ్య నాయకుల పాస్ పోర్టులను రద్దు చేయాలని విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీకి విశాఖ ఇకపై అన్ని విధాలుగా కలసి వస్తుందని అన్నారు. పోయిన ఎన్నికల్లో కేవలం మూడంటే మూడు సీట్లు వచ్చాయని, ఇపుడు సీన్ మారిందని మొత్తానికి మొత్తం సాధిస్తామని, ఇంక టీడీపీ దుకాణం మూసేయాల్సిందేనని సెటైర్లు వేశారు. వంచనపై దీక్షతో పాటు, జగన్ పాదయాత్ర ఇలా అన్ని కార్యక్రమాలు విశాఖ ప్రజలు విజయవంతం చేశారని ఇది విజయానికి సూచిక అన్నారు. మొత్తానికి జగన్ కుడి భుజం విజయసాయి స్పీచ్ టీడీపీ గుండెల్లో భయాందోళనలు కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.