ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆ సీన్ చూపిస్తారా లేదా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy
Updated:  2018-09-04 15:58:23

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆ సీన్ చూపిస్తారా లేదా..

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ ప్ర‌భుత్వం ఘోర వైఫ‌ల్యాల‌తో కూరుకుపోతుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు టీడీపీ నాయ‌కులు పూర్తిగా దూరం అవుతున్నార‌ని విజ‌యసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజా సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు తెలుపుతున్న అభిమానాన్ని టీడీపీ నాయ‌కులు మ‌ర్చిపోయార‌ని అన్నారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీని అంతం చేయ‌డం అని అన్నారు. జ‌గ‌న్ అంటే ప్రేమ,ఆప్యాయ‌త‌, అభిమానం, స‌హాయానికి మారుపేర‌ని ట్వీట్ చేశారు.
jagan
 
మ‌రో ట్వీట్ చేస్తూ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు క‌ళ్లు తెరచి చూడాల్సిన స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు నిన్న భారీ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడిన విష‌యాల‌ను కూడా పోస్ట్ చేశారు విజ‌య‌సాయి రెడ్డి.
vijaya sai reddy
 
మ‌రో ట్వీట్ చేస్తూ సినిమాలో వెన్నుపోటు ఉందా ! లేదా !
chandrababu naidu
 
ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఎన్టీఆర్‌ను ఎలా వంచించారో, ఎన్టీఆర్ ను ఎలా వెన్నుపోటు పొడిచారో చూపిస్తారా ! లేదా అని విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.