విజ‌యసాయిరెడ్డి సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 13:36:57

విజ‌యసాయిరెడ్డి సంచ‌ల‌న ట్వీట్

ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌యసాయి రెడ్డి మీడియా స‌మ‌క్షంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి అలాగే ఆయ‌న కో లకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటారు. రీసెంట్ గా కూడా విజ‌య సాయి రెడ్డి టీటీడీలో పింక్ డైమండ్‌ పోయింద‌ని ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు చెబితే ఆ డైమాండ్ ఎవ‌రిద‌గ్గ‌ర ఉండ‌దని అది కేవ‌లం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంట్లో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఒకవేళ‌ ఆ డైమాండ్ చంద్ర‌బాబు నాయుడి ఇంట్లో లేక‌పోతే తాను త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక తాజాగా ఆయ‌న సాష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని వ‌రుస‌గా రెండు ట్వీట్ లు చేశారు. అందులో మొద‌టిగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఏడాది మనకు చాలా కీలక‌మ‌ని ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధించాలంటే జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలి. మనం శాయశక్తులా కృషి చేసి ఈ కలను సాకారం చేసుకుందాం అని విజయసాయిరెడ్డి  ట్వీట్ చేశారు.
 
ఇక మ‌రో ట్వీట్ చేస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తాను రాసిన‌ గ్లోరీ ఆఫ్‌ లార్డ్ వెంకటేశ్వర అనే పుస్తకాన్ని త్వరలోనే ఆవిష్కరిస్తున్నాన‌ని విజ‌య‌సాయి రెడ్డి తెలిపారు. ఈ పుస్త‌కం తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లో ప్రింట్ చేయ‌నున్నామ‌ని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. స్వామి ఆలయ విశిష్టత, ఆచారాలు, సంప్రదాయాలను ఉద్దేశించి రాశాన‌ని విజ‌యసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
With the blessings of Lord Venkateshwara, my book titled “GLORY OF LORD VENKATESHWARA” to be launched very soon in Telugu , English, Hindi & Gujarati simultaneously. The book is about Lord Venkateshwara, his abode, customs, traditions & rituals.
 
I thank you all friends,well wishes, party leaders & people of the country for wishing me on my birthday. This is a very crucial year for us. Let’s put all our energies to realise our only dream of making JAGAN Sir as CM for greatest progress of AP.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.