బాబుకు విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mp vijaya sai reddy image
Updated:  2018-03-19 11:55:24

బాబుకు విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న స‌వాల్

విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌  ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్ వంటి  అంశాలు  ఏపీ ప్ర‌క‌టించాలంటూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు.... అందులో భాగంగానే  మొన్న కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ అవిశ్వాస తీర్మానం లోక్ స‌భ‌లో  పెట్టారు... అయితే లోక్ స‌భలో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ సోమ‌వారానికి వాయిదా వేశారు... అయితే ఈ తీర్మానం ఈ రోజు చ‌ర్చ‌కు రానున్న నేప‌థ్యంలో మ‌రోసారి ఎన్డీఏ పై అవిశ్వాస తీర్మాన నోటీసులు స్పీక‌ర్ కు అంద‌జేశారు వైసీపీ ఎంపీలు..
 
ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము రాష్ట్రం విభ‌జ‌న జ‌రిగినప్ప‌టి నుంచి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలని పోరాటం చేస్తున్నామ‌ని అన్నారు.. కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ఎన్డీఏతో మిత్ర ప‌క్షంగా ఉండి విభ‌జ‌న హామీల్లో పేర్కొన్న ఒక్క అంశాన్నికూడా సాధించ‌లేక పోయార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.. 
 
ప్ర‌త్యేక హోదా విష‌యంలో ముఖ్య‌మంత్రి రోజుకొక రంగు పూసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని విజ‌య‌సాయి రెడ్డి అన్నారు... అందులో భాగంగానే తాము ఏపీ ప్ర‌యోజ‌నాల‌కోస‌మే అవిశ్వాస తీర్మానం పెట్టామ‌ని, అలాగే కేంద్రంపై ఎవ‌రు అవిశ్వాసం పెట్టినా వైసీపీ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని అన్నారు... 
 
చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని, రాత్రికి రాత్రే ప్రెస్‌మీట్‌ పెట్టి అరుణ్‌ జైట్లీ ప్రకటనను స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు విజ‌య‌సాయి రెడ్డి... ముఖ్య‌మంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా త‌మ‌తో క‌లిసి రావాల‌ని, వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.