విజ‌య‌సాయిరెడ్డి ద‌గ్గ‌ర కీల‌క సాక్ష్యాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-23 10:42:37

విజ‌య‌సాయిరెడ్డి ద‌గ్గ‌ర కీల‌క సాక్ష్యాలు

కుతంత్ర రాజ‌కీయాలు చేయ‌డంలో తెలుగుదేశం త‌న స్ధాయిని ఎప్పుడో  దాటేసింది అని వైసీపి నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.. ప్ర‌భుత్వ అధికారులు కేవ‌లం ప్ర‌జా సేవ‌కు ప్ర‌జాకార్య‌క్ర‌మాల‌ను క్ర‌మ‌ప‌ద్ద‌తిలో జ‌రిపేలా, స‌ర్కారుకి  ప్ర‌జల‌కు మ‌ధ్య వార‌దిగా ప‌నిచేయాలి.. కాని రాజ‌కీయ బ్రోక‌రిజం చేస్తున్నారు అని వైసీపీ నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. తాజాగా  వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ  ఫిరాయింపుల వెనుక, ఉన్న‌త ఉద్యోలుగు ఐఏఎస్ ల పాత్ర ఉంది అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.
 
అధికార పార్టీ నాయ‌కుల‌కు ఈ అధికారులు కొంద‌రు తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అని ఎంపీ విజ‌యసాయిరెడ్డి  ఓ ప్ర‌శ్న లేవ‌నెత్తారు..వైసీపీ నేత‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేసి పార్టీ ఫిరాయింపుల‌కు ప్రోత్సహిస్తున్నారు అని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.. దీనిపై ఐఏఎస్ అధికారులు మండిప‌డ్డారు.. అలాగే విమ‌ర్శిస్తూ ఓ లేఖ కూడా విడుద‌ల చేశారు.
 
ఇక ఐఏఎస్ ల పై విమ‌ర్శ‌లు చేసిన విజ‌య‌సాయిరెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు డీజీపీకి లేఖ కూడా రాశారు. విజ‌య‌సాయిరెడ్డి మాత్రం త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోను అని, వాటికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని అన్నారు.. రాజ్యంగానికి విరుద్దంగా ప్ర‌వర్తిస్తున్న న‌లుగురు ఆల్ ఇండియా స‌ర్వీస్ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు.
 
ప్రస్తుతం సీఎం చంద్ర‌బాబు కార్యాలయంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాజమౌళి, సాయిప్రసాద్‌ తో పాటు ఐపీఎస్ అధికారి ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల వ్యవహార శైలిని విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. అధికారులు సిద్దం అంటే తాను దీనికి సంబంధించిన ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తా అని అన్నారు..
 
అయితే వైసీపీ నాయ‌కులు కూడా దీనిపై సిద్దంగా ఉన్నాము అని తెలుపుతున్నారు.. దీనికి సంబంధించి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ‌ద్ద ఫోన్ సంభాష‌ణ‌లు ఉన్నాయి అని అంటున్నారు నాయ‌కులు.. అందుకే అధికారులు మ‌రోసారి ఇలాంటి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తే విజ‌యసాయిరెడ్డి మీడియాకి ఈ సాక్ష్యాల‌ను ఇస్తార‌ని, కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తారు అని వైసీపీ నాయకులు స‌వాల్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.