విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 19:09:07

విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌

విజ‌య‌వాడ‌లో రంగా హ‌త్య‌తో అక్క‌డ తెలుగుదేశం కాంగ్రెస్ మ‌ధ్య జ‌రిగిన యుద్దం తెలిసిందే.. ఇక అక్క‌డ ప్ర‌జ‌లు కూడా ఆ యుద్ద ఖాండ‌ను మ‌ర్చిపోలేరు... ఇప్ప‌టికీ రంగా అభిమానులు చెప్పేమాట..? తెలుగుదేశంలో కీల‌క నాయ‌కులు పెద్ద పెద్ద మాట‌లు నీతి వాఖ్యాలు చెప్పేవారు రంగాని చంపించార‌ని అంటారు.                   
 
అయితే రంగా హ‌త్య‌పై ఇప్ప‌టికీ ఎక్క‌డోచోట చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది.. ఆ హ‌త్య త‌ర్వాత జ‌రిగిన దారుణాల‌పై ఇప్ప‌టికీ మాట్లాడుకుంటారు.. అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, రంగా హ‌త్య పై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
వంగవీటి రంగా హత్య కేసులో విశాఖ ఈస్ట్‌ ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్టబాబు మూడో నిందితుడిగా ఉన్నారని, ఇది తెలియక ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో ఒక్క‌సారిగా తెలుగుదేశంలో అల‌జ‌డి మొద‌లైంది.
 
వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావయాత్ర లో ఆయ‌న ఈ కామెంట్లు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు..కార్పొరేట్‌ లాభాలకోసమే విమ్స్‌ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విమ్స్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.