బాబు ఫోటోలు పెట్టాలి ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-04 17:48:56

బాబు ఫోటోలు పెట్టాలి ?

ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ మీద ఉంది అని తెలియ‌చేశారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. పార్టీ త‌ర‌పున మా అధ్య‌క్షుడు మొద‌టి నుంచి ఒకే మాట మీద ఉన్నారు అని తెలియ‌చేశారు.. రోడ్ల పై సిగ్న‌ల్స్ క‌నిపిస్తే అక్క‌డ ట‌ర్న్ లు క‌నిపిస్తాయి, వెంట‌నే నాకు చంద్ర‌బాబు యూట‌ర్న్ అంకుల్  క‌నిపిస్తారు.
 
అందుకే ఆయ‌న దారి అని ఆ దారికి వెళ్ల‌కుండా వేరేదారికి వెళ‌తాం అని ఎద్దెవా చేశారు విజ‌యసాయిరెడ్డి.. ఇక యూట‌ర్న్ ఉన్న చోట చంద్ర‌బాబు ఫోటో పెడితే ఆయన‌కు జ్ఞానోద‌యం అవుతుంది అని ఆయ‌న తెలియ‌చేశారు.
 
అధికార‌మంత‌మందు చూడ‌వ‌లెరా అయ్య‌గారి సొబ‌గులు అని బాబు ప‌రిస్దితి అలాగే ఉంది... పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్ లో  ఏం జ‌రిగింది అనేది అంద‌రూ  ఫోటోలు చూశారు...ఈయ‌న దావోస్ కు వెళ్లి  స‌మ్మిట్ అని చెప్పి ఇడ్లీ  వ‌డ‌దోస పొంగ‌లి అంటూ ఆంద్రావంట‌ల‌ని ప్ర‌మోట్ చేస్తున్నాను అని చెప్పాడు అలాగే ఉంది ఈయ‌న రాజ‌కీయం.
 
పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్ లో తెలుగుదేశం ఎంపీలు  మా బాబు గారిని క‌ల‌వండి క‌ల‌వండి అని కోర‌డం జ‌రిగింది... ఇక నిన్న ఆయ‌న ఎవ‌రితో ఫోటోలు మంత‌నాలు జ‌రిపారంటే బీజేపీ ప‌క్షాలు, బీజేపీ ఎంపీల‌తో ఆయ‌న మాట్లాడారు.. అస‌లు అవిశ్వాస మ‌ద్ద‌తు కోసం బీజేపీ ఎంపీల‌ను క‌ల‌వ‌డం ఏమిటి ఓసారి ఆలోచించండి అని అన్నారు విజ‌య‌సాయిరెడ్డి.. ముఖ్యంగా  హీరోయిన్లు హీరోతో ఫోటోలు దిగ‌డం ఇది ఎంత దారుణం సీఎం స్దాయి నాయ‌కుడు ఇలా చేస్తున్నాడు అంటే తెలుగుదేశం ప‌రిస్దితి ఎలా ఉందో చూడండి అని ఆయ‌న ఫైర్ అయ్యారు.
 
నిన్న పార్ల‌మెంట్లో బాబు ఫోటోలు ఎలా ఉన్నాయి అంటే సినిమా షూటింగ్ జ‌రిగిన‌ప్పుడు క్లాప్ కొట్టినప్పుడు తీసుకునే ఫోటోల్లా ఉన్నాయి అని అన్నారు.. బాబు పాల‌న ఏపీలో ప్ర‌జ‌లు అంద‌రూ చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఏపీలో 25 కు 25 వైసీపీ ఎంపీ స్ధానాలు గెలుచుకుంటుంది.... అలాగే  150  అసెంబ్లీ స్ధానాల‌ను వైసీపీ గెలుచుకుంటుంది అని విజ‌య‌సాయిరెడ్డి తెలియ‌చేశారు.....
 
య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడిన విష‌యాలు ఆయ‌న వ్యాఖ్య‌లు కాస్త ఆలోచించుకోవాలి ఆయ‌న‌కు అనుభవం ఉంది... స్పీక‌ర్ పై చేసిన వ్యాఖ్య‌ల‌పై నాకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తే  ఎలా? చ‌ట్టాలు అంద‌రికీ ఒక‌టే క‌దా బాబుగారికి కూడా వ‌ర్తిస్తాయి అని తెలియ‌చేశారు ...య‌న‌మ‌ల గారికి అనుభ‌వం ఉంది ఆయ‌నంటే మాకు కొంత గౌర‌వం ఉంది... ఆయ‌న నిల‌బెట్టుకుంటే మంచింది అని విజ‌య‌సాయిరెడ్డి తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.